Indira Devi Properties: తల్లిదండ్రుల ఆస్తులు కొడుకు సంక్రమించడం సాధారణం. కూతుళ్ళకు ఎంతో కొంత కట్నం రూపంలో ఇస్తారు కానీ, పూర్తి వాటా ఇచ్చే పేరెంట్స్ చాలా అరుదు. చట్టం మాత్రం ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే… సూపర్ స్టార్ మహేష్ తల్లిగారైన ఇందిరా దేవి తన పేరిట ఉన్న ఆస్తులు కూతుళ్ళకు రాసేసిందట. ఆమె నిర్ణయం వెనుక బలమైన కారణం కూడా ఉందట. కృష్ణకు ఇందిరా దేవి వరసకు మరదలు అవుతారట. అంటే కృష్ణ బంధువుల అమ్మాయైన ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు.

సూపర్ స్టార్ అయ్యాక కృష్ణ కోట్ల ఆస్తులు కూడబెట్టారు. హైదరాబాద్ లో పద్మాలయా స్టూడియో సైతం నిర్మించారు. ఇక మహేష్ స్టార్ గా ఎదిగాక వారి ఆస్తులు మరింతగా పెరిగాయి. అయితే మహేష్ తల్లిగారైన ఇందిరా దేవి పేరిట వారసత్వంగా వచ్చిన కోట్లు ఆస్తి ఉందట. అది స్థిరాస్తి రూపంలో ఉందట. దీనిని ఇందిరా దేవి కూతుళ్ళకు ఇచ్చేశారని సమాచారం. ఇద్దరు కొడుకులు వాళ్ళ వారసులు ఉండగా… ఇందిరా దేవి కూతుళ్లకు తన ఆస్తి ఇవ్వడం వెనుక బలమైన కారణమే ఉంది.
ఇందిరా దేవికి తల్లి నుండి ప్రత్యేకంగా కొంత ఆస్తి సంక్రమించిందట. కూతురిపై ప్రేమతో ఇందిరా దేవి తల్లి ఆమెకు ఇచ్చారట. ఈ క్రమంలో తన ఆస్తి తన కూతుళ్ళకు చెందాలని ఇందిరా దేవి భావించారట. ఆ ఆస్తి మళ్ళీ వాళ్ళ కూతుళ్ళకు వారసత్వంగా వెళ్లాలని నియమం పెట్టుకున్నారట. ఈ కుటుంబ నిబంధన అనుసరించి ఇందిరా దేవి తన ఆస్తి ముగ్గురు కూతుళ్ళకు సమానంగా ఇచ్చారనేది విశ్వసనీయ సమాచారం.

తల్లి నిర్ణయాన్ని మహేష్ గౌరవించి ఉంటారు. ఎందుకంటే స్టార్ గా మహేష్ ఏడాదికి వందల కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి తల్లి ఆస్తిలో వాటా తీసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. నిజం చెప్పాలంటే కూతుళ్ళకు కూడా ఆ ఆస్తి అంత ముఖ్యం కాదు. ఇందిరా దేవి ముగ్గురు అల్లుళ్ళు వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు. పెద్ద అల్లుడు గల్లా జయదేవ్ అయితే వేల కోట్ల ఆస్తిపరుడు. కాబట్టి ఇందిరా దేవి కూతుళ్ళకు తల్లి ఆస్తి కేవలం సెంటిమెంట్ మాత్రమే. దాన్ని వారు డబ్బుతో కొలవరు.
[…] […]