https://oktelugu.com/

Rajamouli: చరిత్ర ఇదీ… మరి రాజమౌళి ఏం చేస్తాడో?

Rajamouli: ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రకటన రోజే కథపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ కథకు మోటార్ సైకిల్ డైరీస్ అనే ఓ స్పానిష్ మూవీ స్ఫూర్తి అన్నారు. ఇక చరిత్రలో ఉద్యమ వీరులుగా ఉన్న కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలలో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ కొన్నేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాత జీవితం గడిపారు. రెండు భిన్నమైన ప్రాంతాలకు, కాలాలకు చెందిన భీమ్, అల్లూరి కలిస్తే, వారిద్దరూ ఏకమైన […]

Written By:
  • Shiva
  • , Updated On : November 24, 2021 / 02:02 PM IST
    Follow us on

    Rajamouli: ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రకటన రోజే కథపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ కథకు మోటార్ సైకిల్ డైరీస్ అనే ఓ స్పానిష్ మూవీ స్ఫూర్తి అన్నారు. ఇక చరిత్రలో ఉద్యమ వీరులుగా ఉన్న కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలలో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ కొన్నేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాత జీవితం గడిపారు. రెండు భిన్నమైన ప్రాంతాలకు, కాలాలకు చెందిన భీమ్, అల్లూరి కలిస్తే, వారిద్దరూ ఏకమైన బ్రిటీష్ ఆధిపత్యం పోరాటం చేస్తే ఎలా ఉంటుంది?.. అనేదే ఆర్ ఆర్ ఆర్ కథ.

    నిజమైన వ్యక్తుల జీవితాలకు రాజమౌళి ఎలాంటి ఫిక్షన్ జోడిస్తారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. అయితే కొమరం భీమ్, అల్లూరి జీవితాల్లో ఉన్న మరొక కామన్ పాయింట్.. ఇద్దరూ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతారు. యుక్త వయసులోనే పుడమి కోసం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తారు. కాగా రాజమౌళి వాళ్ళ మరణం వరకు కథను తీసుకెళ్లరు అని తెలుస్తుంది.

    తెలుగు ప్రేక్షకులు ట్రాజిక్ ఎండింగ్స్ అసలు ఇష్టపడరు. హీరో హీరోయిన్ చనిపోవడం జీర్ణించుకోలేరు. సినిమా మొత్తం హీరో ఎన్ని బాధలు పడ్డా, ఎండింగ్ మాత్రం హీరోకు ఫేవర్ గా ఉండాలి. అందుకే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమరం భీమ్, అల్లూరి పాత్రలకు ముగింపు చావుతో కాకుండా భారీ విజయంతో ఉంటుందని సమాచారం.

    Also Read: Rajamouli: టైం రా బాబు… రాజమౌళిని ఎగతాళి చేస్తున్న పవన్ ఫ్యాన్స్!

    మరి చరిత్రను మార్చిన రాజమౌళి పై విమర్శల దాడి జరిగే అవకాశం లేకపోలేదు. చరిత్రతో సంబంధం లేదు, ఇది ఊహాజనితమైన కథ అని రాజమౌళి చెబుతున్నప్పటికీ… పాత్రల పేర్లు, కథ విషయంలో చాలా పోలికలు ఉన్నాయి. చరిత్రను మార్చి చూపించనున్న రాజమౌళిపై సాంప్రదాయవాదులు, చరిత్రకారులతో పాటు భీమ్, అల్లూరి అభిమానుల నుండి నిరసనలు వెల్లువెత్తే అవకాశం కలదు. వాటిని ఎదుర్కోవడం రాజమౌళికి మరొక ఛాలెంజ్.

    Also Read: Mahesh Babu: ఆ హీరోయిన్ తో అక్కినేని హీరో విడాకులు… మహేష్ మనసుకు గాయమైన వేళ!

    Tags