
సీనియర్ హీరో వెంకటేశ్ ఎప్పుడు ఇమేజ్ చట్రంలో ఇరుక్కోరు. తాను స్టార్ హీరోను.. ఇలాంటి సినిమాలే చేస్తాను? ఇలానే వ్యవహరిస్తాను. అని కథకు సంబంధం లేని స్టార్ సెలబ్రెటీని చూపించరు. అందుకే వెంకీ సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉండి ప్రేక్షకులను మెప్పిస్తాయి.
ఇంతవరకు తెలుగులో ఏ స్టార్ హీరో చేయని విధంగా తెలుగులో ఈ కాలంలో మొదటి మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ఏకంగా స్టార్ హీరో మహేష్ బాబుతో కలిసి నటించి వెంకటేశ్ తాను ఇమేజ్ చట్రంలో ఇరుక్కోనని చాటిచెప్పాడు. ఇప్పటికీ వెంకటేశ్ తన సహనటులు, సాంకేతిక నిపుణులతో స్నేహ పూర్వక సంబంధాన్ని కొనసాగించే ఉల్లాసమైన వ్యక్తిగా పేరుంది.
ఎఫ్3 షూటింగ్ లో ప్రస్తుతం వెంకటేశ్ పాల్గొంటున్నారు. ఆ సినిమా షూటింగ్ లోనూ వెంకటేశ్ చాలా సందడి చేస్తున్నాడట.. మరో హీరో వరుణ్ తేజ్, కమెడియన్ సునీల్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత శీరిష్ లతో సరదాగా గడిపిన ఫొటో తాజాగా విడుదలైంది.
స్టార్ హీరోలంతా గంభీరంగా బెట్టు చేస్తూ కనిపిస్తుంటారు. కానీ వెంకటేశ్ మాత్రం సెట్స్ లో ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుందని ఈ షాట్ చూస్తుంటే అర్థమవుతోంది.
ఎఫ్3 సినిమా మొదటి ఎఫ్2తో పోలిస్తే మూడు రెట్లు సరదాగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. వెంకటేశ్, సునీల్, మెహ్రీన్ లు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మైసూర్ లో వచ్చే షెడ్యూల్ లో వరుణ్ తేజ్ పాల్గొననున్నారు.
ఎఫ్3 సినిమాలో వెంకటేశ్ రేచీకటితో బాధపడే వ్యక్తిగా నవ్వులు పూయిస్తాడట..వరుణ్ తేజ్ పాత్ర ఫుల్ కామెడీ పండిస్తుందని చెబుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.