https://oktelugu.com/

“ఎఫ్ 3” కోసం పక్కా ప్లాన్.. వెంకీ రెండు పూర్తి చేశాడు !

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వస్తోన్న “ఎఫ్ 3” సినిమా షూటింగ్ ఆగి ఇప్పటికే రెండు నెలలు అయిపోయింది. అయితే ఎఫ్ 3 కి వచ్చిన గ్యాప్ లో వెంకటేష్ “దృశ్యం 2” సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధం చేసుకున్నాడు. అలాగే నారప్ప షూటింగ్ ను కూడా ఎప్పుడో పూర్తి చేశాడు. దాంతో ఇప్పుడు వెంకటేష్ నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. థియేటర్స్ ఓపెన్ చేసిన […]

Written By:
  • admin
  • , Updated On : May 18, 2021 / 04:25 PM IST
    Follow us on

    విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వస్తోన్న “ఎఫ్ 3” సినిమా షూటింగ్ ఆగి ఇప్పటికే రెండు నెలలు అయిపోయింది. అయితే ఎఫ్ 3 కి వచ్చిన గ్యాప్ లో వెంకటేష్ “దృశ్యం 2” సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధం చేసుకున్నాడు. అలాగే నారప్ప షూటింగ్ ను కూడా ఎప్పుడో పూర్తి చేశాడు. దాంతో ఇప్పుడు వెంకటేష్ నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

    థియేటర్స్ ఓపెన్ చేసిన వెంటనే ముందుగా ‘నారప్ప’ను రిలీజ్ చేయనున్నారు. నారప్ప రిలీజ్ అయిన ముప్పై రోజులకు ‘దృశ్యం 2’ సినిమాని రిలీజ్ చేయడానికి సురేష్ బాబు ఇప్పటికే సన్నాహాలు చేశాడు. ఇక ఎలాగూ వచ్చే నెల 16 నుంచి “ఎఫ్ 3” సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. వచ్చేనెల నాటికి పరిస్థితులు కూడా చక్కదిద్దుకుంటాయనే అంచనా ఉంది కాబట్టి, హీరోలిద్దరూ షూట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కరోనా నుండి ఇటివల కోలుకున్నాడు. ప్రస్తుతం వచ్చే నెలలో జరగబోయే సీన్స్ కి సంబంధించిన షూటింగ్ కి సిద్ధం అవుతున్నాడు. ఒకవేళ వచ్చే నెలలో కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. ఓన్లీ వరుణ్ తేజ్ పార్ట్ కి సంబంధించిన సీన్స్ ను పూర్తి చేసి, ఆ తరువాత నెలలో వెంకీ బ్యాలెన్స్ సీన్స్ పూర్తి చేస్తారట.

    మొత్తానికి ‘ఎఫ్ 3’ సినిమాని జెడ్ స్పీడ్ తో పూర్తి చేయడానికి అనిల్ రావిపూడి ఈ సారి పక్కా ప్లాన్ తో షూట్ ప్లాన్ చేశాడు. నిజానికి కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉండి ఉంటే.. ఎఫ్ 3 సినిమా ఈ నెలలోనే రిలీజ్ కూడా అయి ఉండేది. కానీ, కరోనా సెకండ్ వేవ్ మొత్తం తారుమారు చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మెహ్రీన్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ లోపు ఆమె సీన్స్ ను కూడా పూర్తి చేయాల్సి ఉంది.