https://oktelugu.com/

ఫ్రీగా రూ.50 వేలు అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా పొందాలంటే..?   

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రత్యేకమైన కాంటెస్ట్ ద్వారా 50,000 రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. కరోనా కష్ట కాలంలో డబ్బులు సంపాదించాలని అనుకునే వాళ్లు ఈ కాంటెస్ట్ లో పాల్గొనడం ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చు. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లకుండానే సులువుగా డబ్బు సంపాదించే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్‌ కోసం లోగోను తయారు చేయడం ద్వారా ఈ 50,000 రూపాయలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 18, 2021 / 04:21 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రత్యేకమైన కాంటెస్ట్ ద్వారా 50,000 రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. కరోనా కష్ట కాలంలో డబ్బులు సంపాదించాలని అనుకునే వాళ్లు ఈ కాంటెస్ట్ లో పాల్గొనడం ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చు. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లకుండానే సులువుగా డబ్బు సంపాదించే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది.

    వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్‌ కోసం లోగోను తయారు చేయడం ద్వారా ఈ 50,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా లోగోను క్రియేట్ చేసేంత ప్రతిభ ఉంటే 50,000 రూపాయలు గెలుచుకోవడం కష్టమేమీ కాదు. కేంద్రం మై గౌ ఇండియా ట్విట్టర్ ద్వారా ఈ మేరకు ప్రకటన చేసింది. కేంద్రానికి చెందిన ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఈ కాంటెస్ట్ ను నిర్వహిస్తూ ఉండటం గమనార్హం.

    ఈ కాంటెస్ట్ కు పోటీ చేసిన వారిలో తొలి విజేతకు 50,000 రూపాయలతో పాటు సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న మరో ముగ్గురికి కూడా సర్టిఫికెట్లు లభిస్తాయి. మైగౌ పోర్టల్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని సులభంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. లోగో ఫార్మాట్ చాలా క్లియర్‌గా ఉండటంతో పాటు లోగోకు సంబంధించి 100 పదాలతో వివరణ కచ్చితంగా ఉండాలి.

    మే నెల 31వ తేదీ వరకు ఈ కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా పేద ప్రజలు దేశంలో రేషన్ సరుకులను ఎక్కడైనా పొందే అవకాశం కల్పిస్తోంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ వల్ల ప్రయోజనం చేకూరనుంది.