https://oktelugu.com/

F3 Movie: F3 షూటింగ్ జర్నీ పూర్తయింది.. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!

F3 Movie: F2.. నవ్వులతో ఫ్యాన్స్ ను ఊపు ఊపేసింది. వెంకటేశ్ కామెడీ టైమింగ్ కు.. వరుణ్ తేజ్ అమాయకత్వానికి ప్రేక్షకులు నవ్వకుండా ఉండలేకపోయారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్3’ అంతకుమించిన కామెడీ డోస్ తో అలరించడానికి సిద్ధమైంది. తాజాగా ఆ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసినట్టు చిత్రం యూనిట్ ప్రకటించింది. ‘‘F3 షూటింగ్ జర్నీ పూర్తయింది.. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది! వస్తే.. కొద్దిగా ముందుగా.. వెళ్లినా కొద్దిగా వెనకగా..! థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా!’’ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 29, 2022 / 05:54 PM IST
    Follow us on

    F3 Movie: F2.. నవ్వులతో ఫ్యాన్స్ ను ఊపు ఊపేసింది. వెంకటేశ్ కామెడీ టైమింగ్ కు.. వరుణ్ తేజ్ అమాయకత్వానికి ప్రేక్షకులు నవ్వకుండా ఉండలేకపోయారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్3’ అంతకుమించిన కామెడీ డోస్ తో అలరించడానికి సిద్ధమైంది. తాజాగా ఆ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసినట్టు చిత్రం యూనిట్ ప్రకటించింది.

    ‘‘F3 షూటింగ్ జర్నీ పూర్తయింది.. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది! వస్తే.. కొద్దిగా ముందుగా.. వెళ్లినా కొద్దిగా వెనకగా..! థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా!’’ అని ట్విట్టర్ వేదికగా ఎఫ్3 చిత్రయూనిట్ ప్రకటించింది. కచ్చితంగా థియేటర్లకే వస్తామని స్పష్టం చేసింది. విక్టరీ వెంకటేష్మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న ఎఫ్3 చిత్ర టాకీపార్ట్ పూర్తయినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

    అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల కానుంది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తయినట్లుగా తెలుపుతూ చిత్రయూనిట్ ఓ వీడియోని విడుదల చేసింది. ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

    వెంకీ, వరుణ్‌ల సరసన తమన్నా, మెహరీన్‌ నటిస్తోన్న ఈ చిత్రంలో మూడో హీరోయిన్‌గా సోనాల్ చౌహన్ నటిస్తోంది. ట్రేడ్ వర్గాల్లో ఉన్న క్రేజ్ ఈ సినిమా మీద వచ్చిన పాజిటివ్ వైబ్స్ దృష్ట్యా త్వరలోనే చిత్ర అప్‌డేట్స్‌‌ని విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాగా.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారు ఇతర తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.