F3 Movie: దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా 2019 సంక్రాంతికి విడుదలైన సినిమా ’ఎఫ్ 2’ మూవీ సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చిందనే సినిమా ఎఫ్ 2. అనిల్ రావిపూడి హిట్ రికార్డు చూసిన తర్వాత ఎఫ్ 3 సినిమాపై బారి అంచనాలు పెరిగాయి. ఈ సినిమా రిలీజ్‌పై తాజాగా ప్రకటన విడుదలైంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని గతంలో ప్రకటించగా. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఎఫ్ 3 మూవీ విడుదల తేదీని వచ్చే ఏడాది 2022, ఫిబ్రవరి 25కు మారుస్తునట్లు ప్రకటించారు.
ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలుపై తెరకెక్కనున్నది .
బొమ్మ ఎప్పుడు పడితే..అప్పుడే మనకు నవ్వుల పండగ🎉
Lets Celebrate the Most Awaited Fun Franchise #F3Movie in cinemas from Feb 25th,2022.
Triple Fun Guaranteed😁#F3FromFeb25@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official @Mee_Sunil pic.twitter.com/qGDYDKPTeJ
— Sri Venkateswara Creations (@SVC_official) October 24, 2021
ఈ సినిమా కథ ఫన్నీగా పొట్టలు చెక్కలయ్యేలా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట అనిల్ రావిపూడి. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటించిన ‘దృశ్యం 2’ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమా కూడా త్వరలో విడుదల చేయనున్నారట.