https://oktelugu.com/

Sai Pallavi: అందాన్ని కాదు నటన చూడాలి అంటున్న సాయి పల్లవి…

Sai Pallavi: ప్రేక్షకులను అలరించడానికి  అందం ముఖ్యం కాదు నటనే ముఖ్యమంటున్నారు సాయి పల్లవి. తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది సాయి పల్లవి.  సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో సహజమైన నటనతో, కురి విప్పిన నెమలి వలె ప్రేక్షకుల కళ్ళను తన వైపే ఉంచేలా తన డాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది ఈ అమ్మడు. ఈ పరిశ్రమ అంటే ఒక ఇంద్రధనుస్సు వంటిదని అంతా రంగుల మయం అని సినిమా కొత్తలో అందం విషయంలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 24, 2021 / 03:30 PM IST
    Follow us on

    Sai Pallavi: ప్రేక్షకులను అలరించడానికి  అందం ముఖ్యం కాదు నటనే ముఖ్యమంటున్నారు సాయి పల్లవి. తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది సాయి పల్లవి.  సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో సహజమైన నటనతో, కురి విప్పిన నెమలి వలె ప్రేక్షకుల కళ్ళను తన వైపే ఉంచేలా తన డాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది ఈ అమ్మడు.

    ఈ పరిశ్రమ అంటే ఒక ఇంద్రధనుస్సు వంటిదని అంతా రంగుల మయం అని సినిమా కొత్తలో అందం విషయంలో తనకు కొన్ని భయాలు ఉండేవని చెప్పుకొచ్చారు నటి సాయి పల్లవి. తొలి సినిమా సమయంలో అందం విషయంలో తన ఆలోచనలు ఎలా ఉండేవని ప్రశ్నిస్తే… ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. కాలేజీ చదివే సమయంలో సినీ పరిశ్రమకు వచ్చా. సగటు అమ్మాయిల్లాగే అందం విషయంలో నాకు కొన్ని భయాలుండేవి. ఎందుకంటే నేను చూసిన హీరోయిన్లంతా అందమైన వాళ్లే. మొదట్లో నేను విమర్శలకు గురయ్యాను అని చెప్పుకొచ్చారు సాయి పల్లవి.

    నా ముఖంపై ఉన్న మొటిమలు చూసి హీరోయిన్ ఏంటి అని అన్నారు. నా మొదటి సినిమా ‘ప్రేమమ్‌’ విడుదలయ్యాక విమర్శించిన వారే ప్రశంసించారని హర్షం వ్యక్తం చేసింది. నటించిన క్యారెక్టర్‌నే ఇష్టపడతారు తప్ప… పైకి కనిపించే అందాన్ని కాదని తెలుసుకున్నానని చెప్పింది. ప్రేమమ్‌ సినిమా నాలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపింది అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.

    ఇటీవల విడుదలైన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. హీరో రానా,  సాయి పల్లవి జంటగా నటించిన ‘విరాటపర్వం’ త్వరలో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం హీరో నాని, సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్న చిత్రం ” శ్యామ్‌ సింగరాయ్‌” షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు సాయి పల్లవి.