F3 Closing Collections: విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన F3 సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్లను రాబట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..2019 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన F2 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ పై మొదటి నుండే ట్రేడ్ లో మంచి బజ్ ఉన్నది..దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది..ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 65 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చినప్పటికీ లాంగ్ రన్ లో మాత్రం బయ్యర్లకు దెబ్బేసింది..విక్రమ్ మరియు మేజర్ వంటి సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడం తో ఈ మూవీ కలెక్షన్స్ పై చాలా తీవ్రమైన ప్రభావమే పడింది..ఫుల్ రన్ భారీ లాభాలను తెచ్చిపెడుతుంది అనుకున్న ఈ సినిమా చివరికి భారీ నష్టాలను చవి చూసింది..ఇప్పటికే 20 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు క్లోసింగ్ కి దగ్గరగా వచ్చేసింది..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది..బయ్యర్లకు వచ్చిన నష్టాలు ఎంత అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Also Read: BJP vs Congress: మోడీ, షా, అద్వానీ విచారణ ఎదుర్కొన్నారు కదా.. సోనియా, రాహుల్ లకు ఎందుకంత లొల్లి..?
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం..రెండవ రోజు 8 కోట్లు ..మూడవ రోజు కూడా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి కేవలం మూడు రోజుల్లోనే 32 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది..ఇక ఆ తర్వాత మొదటి వారం లో మిగిలిన నాలుగు వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి పర్వాలేదు అనిపించుకుంది..అలా మొదటి వారం లో 48 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో కేవలం 57 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది..అంటే దాదాపుగా బయ్యర్లకు 8 కోట్ల రూపాయిల నష్టాలను చూపించింది అన్నమాట ఈ సినిమా..ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది..F2 సినిమా ఓవర్సీస్ లో దాదాపుగా 2.2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే F3 సినిమా కేవలం 1.4 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది..విక్రమ్ మరియు మేజర్ సినిమాలు భారీ అయినా ప్రభావం F3 సినిమా మీద ఇక్కడ కూడా పడింది అనే చెప్పాలి..మొత్తానికి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా కెరీర్ లో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి కి F3 రూపం లో ఒక ఫ్లాప్ తగిలింది..ఈ సినిమా తర్వాత ఆయన బాలయ్య బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో అనిల్ రావిపూడి మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Also Read: Sridevi- Chiranjeevi: శ్రీదేవి నిర్మాతగా.. చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఏమిటో తెలుసా?
[…] Also Read: F3 Closing Collections: F3 క్లోసింగ్ కలెక్షన్లు.. దిల్… […]