Heroes Who Left Software Jobs: సినిమా అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కొంతమంది ఈ రంగుల ప్రపంచం లోకి అడుగుపెట్టడానికి కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగాలను కూడా వదిలి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చారు..టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చినవాళ్లు ఇండస్ట్రీ లో నేడు టాప్ స్టార్స్ గా చలామణి అవుతున్నారు..కానీ టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రాక ఇప్పటికి కృష్ణ నగర్ చుట్టూ తిరుగుతున్న యువకుల సంఖ్య వేలల్లో ఉంటుంది..వీళ్ళు ఇప్పటికి అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు..పాపం సినిమా ఇండస్ట్రీ మీద మక్కువ తో సంపాదించుకున్న ఉద్యోగాలు కూడా వదిలి వచ్చినవాళ్లు అయితే ఈరోజు కుటుంబాలకు దూరం అయ్యి తిండి కూడా లేకుండా గడుపుతున్నారు..ఇది ఇలా ఉండగా లక్షల కొద్ది జీతాలు వదులుకొని ఇండస్ట్రీ వచ్చి సక్సెస్ అయిన ముగ్గురు హీరోల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము..ఆ ముగ్గురు మరెవరో కాదు..కిరణ్ అబ్బవరం, నవీన్ పోలిశెట్టి మరియు సత్య దేవ్..ఈ ముగ్గురు హీరోలకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కిరణ్ అబ్బవరం :

‘రాజా వారు రాణి గారు’ అనే సినిమా తో ఇండస్ట్రీ పరిచయం అయిన ఈ కుర్ర హీరో తొలి సినిమాతోనే భారీ పరాజయం అని మూటగట్టుకున్నాడు..ఇక ఆ తర్వాత ఈయన చేసిన ‘SR కల్యాణమండపం’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా తర్వాత ఆయన క్రేజీ హీరోలలో ఒకరిగా మారిపోయాడు..ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన సెబాస్టియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది..ఇప్పుడు ఆయన సమ్మతమే అనే సినిమా ద్వారా మన ముందుకి రాబోతున్నాడు..ఇవన్నీ పక్కన పెడితే కిరణ్ అబ్బవరం సినిమాల్లోకి రాక ముందు ఒక్క ప్రముఖ MNC కంపెనీ లో జాబ్ చేసేవాడట..ఆయన నెల జీతం దాదాపుగా 70 వేల రూపాయిలు ఉండేదట..ఇటీవల ఈటీవీ లో ప్రసారం అయ్యే అలీ తో జాలిగా టాక్ షో లో పాల్గొన్న కిరణ్ ఈ విషయం ని చెప్పుకొచ్చాడు..సినిమాల మీద విపరీతమైన పిచ్చి వల్ల ఇంట్లో గొడవలు ఏసుకొని జాబ్ మానేసి ఇండస్ట్రీ కి వచ్చాను అని.దేవుడి దయ వల్ల మొత్తానికి సక్సెస్ అయ్యి నిలబడగలిగాను అని చెప్పుకొచ్చాడు కిరణ్.
నవీన్ పోలిశెట్టి :

Also Read: Secundrabad Incident: సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు.. పక్కా ప్లాన్‌తోనే జరిగిందా!?
ప్రసుతం ఈ కుర్ర హీరో కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈయన సినిమాల్లోకి రాకముందు అమెరికా లో ఒక్క సాఫ్ట్ వేర్ కంపెనీ లో నెలకు నాలుగు నుండి 5 లక్షల రూపాయిలు జీతం తీసుకునే రేంజ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి..అంతే NIT లో ఇతను టాప్ ర్యాంకర్..కానీ ఇతనికి మొదటి నుండి IT ఫీల్డ్ కంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే పిచ్చి..ఏరోజైనా పెద్ద స్టార్ హీరో అయ్యి కోట్లాది మంది అభిమానులను సంపాదించాలనేది ఇతని కోరిక..ఆ కోరికతోనే ఇండస్ట్రీ లోకి వచ్చాడు..సినిమాల్లో అవకాశాలు రప్పించుకోవడం కోసం ఇతను సుమారు 5 ఏళ్ళు కష్టపడ్డాడు..అలా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు..తొలి సినిమాతోనే ఎవరీ కుర్రాడు..మంచి టాలెంట్ ఉన్నట్టుండి అని అందరిని అనుకునేలా చేసాడు..ఆ తర్వాత మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా లో ఛాన్స్ వచ్చింది..ఈ సినిమా తో కాస్త పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి 2015 వ సంవత్సరం నుండి 2018 వ సంవత్సరం వరుకు వరుసగా హిందీ లో పలు సీరియల్స్ లో కనిపించాడు..ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే సినిమా ద్వారా తొలిసారిగా హీరోగా కనిపించాడు..తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి , రెండవ సినిమా జాతి రత్నాలు తో ఇండస్ట్రీ రికార్డ్స్ మోత మోగిపోయ్యే హిట్ కొట్టాడు..ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని తన చేతిలో పెట్టుకొని ఇండస్ట్రీ లో టాప్ స్టార్ గా ఎదిగే దిశగా ముందుకు పోతున్నాడు.
సత్య దేవ్:

టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్స్ లో సత్యదేవ్ ఒక్కరు..ఇతను కూడా సినిమాల్లోకి రాకముందు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగే..హైదరాబాద్ లోని ఒక్క ప్రముఖ MNC కంపెనీ లో టీం లీడర్ గా రెండు లక్షల రూపాయిలు జీతం తీసుకునే స్థాయి ఉన్న IT ఉద్యోగి..US లో పని చేసే ఆఫర్ కూడా వచ్చింది..కానీ సినిమాల మీద అమితాసక్తితో జాబ్ ని వదిలేసి ఇండస్ట్రీ కి వచ్చాడు..అవకాశాల కోసం ఇతను కూడా చాలా కష్టపడ్డాడు..2013 వ సంవత్సరం లో ప్రభాస్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా ఇండస్ట్రీ పరిచయం అయ్యాడు..అలా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన సత్యదేవ్ నేడు మంచి డిమాండ్ ఉన్న హీరోలలో ఒకడు..ఈరోజు ఆయన హీరో గా నటించిన గాడ్సే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read: Rajinikanth- Jailer: ఈసారి రజినీకాంత్ ‘జైలర్’ అట!
[…] Also Read: Heroes Who Left Software Jobs: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వది… […]