https://oktelugu.com/

Extra – Ordinary Man Trailer : ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రివ్యూ… నితిన్ క్యారెక్టర్ ఇదే, రాజశేఖర్ ఎంట్రీ అదిరింది!

బాలయ్య మీద ఈ సినిమాలో ఓ డైలాగ్ కొట్టారు. ఆయన పబ్లిక్ లో ఫ్యాన్స్ ని కొట్టే విషయాన్ని ప్రస్తావించారు. ఇక ట్రైలర్ చివర్లో రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఖైదీగా కనిపించారు.

Written By: , Updated On : November 27, 2023 / 06:36 PM IST
Follow us on

Extra – Ordinary Man Trailer : నితిన్ హీరోగా దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. డిసెంబర్ 8న గ్రాండ్ గా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. దర్శకుడు వక్కంతం వంశీ కామెడీ, రొమాన్స్ ప్రధానంగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. చివర్లో హీరో రాజశేఖర్ ఎంట్రీ అదిరింది.

చిన్నప్పటి నుండి తన లైఫ్ అంటే తనకే బోరింగ్. పెద్దయ్యాక హీరో జూనియర్ ఆర్టిస్ట్ అవుతాడు. ఎలాంటి గౌరవం, ఎదుగూ బొదుగూ లేని జీవితంలో మిరాకిల్ జరగాలని హీరో కోరుకుంటాడు. అప్పుడే జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. హీరో జీవితం మలుపు తిరిగుంది. నితిన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. హీరోయిన్ శ్రీలీలతో మనోడి లవ్ ట్రాక్ కామెడీగా సాగినట్లు ఉంది.

బాలయ్య మీద ఈ సినిమాలో ఓ డైలాగ్ కొట్టారు. ఆయన పబ్లిక్ లో ఫ్యాన్స్ ని కొట్టే విషయాన్ని ప్రస్తావించారు. ఇక ట్రైలర్ చివర్లో రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఖైదీగా కనిపించారు. ”జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరు ఏం చెప్పినా వినను..” అని రాజశేఖర్ డైలాగ్ చెప్పగా.. ”జీవితానా అన్నా?” అని నితిన్ సెటైర్ వేశాడు.” కాదు జీవితం, నాకు రెండూ ఒకటేలే” అని రాజశేఖర్ సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు.

రాజశేఖర్ ఎక్కడికి వెళ్ళినా పక్కనే భార్య జీవిత ఉంటుంది. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ ఈ సెటైరికల్ డైలాగ్ చెప్పించారు. అది బాగుంది. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఐదేళ్ల తర్వాత మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నారు. నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ డిజాస్టర్ కావడంతో దర్శకుడిగా గ్యాప్ వచ్చింది. ఇది ఆయన రెండో ప్రయత్నం. కామెడీ రొమాంటిక్ జోనర్ ఎంచుకున్నారు. అటు నితిన్ కూడా ప్లాప్స్ లో ఉన్నాడు. ఇద్దరికీ ఈ చిత్ర విజయం అవసరం అని చెప్పాలి.

Extra - Ordinary Man Trailer | Nithiin, Sreeleela | Vakkantham Vamsi | Harris Jayaraj