https://oktelugu.com/

Elon Musk : ఇటలీ అధ్యక్షురాలిని లైన్ లో పెట్టిన మస్క్.. డేటింగ్ చేస్తున్నారా? అని అడిగితే.. ఏం సమాధానం చెప్పాడంటే..

ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీమంతుడు ఎలన్ మస్క్ తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. ఇటీవల ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తో కలిసి ఒక ఫోటో దిగాడు. దాన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. అది ఒకసారిగా చర్చకు దారి తీసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 25, 2024 / 05:39 PM IST

    Elon Musk-Georgia

    Follow us on

    Elon Musk  : వారిద్దరూ కలిసి దిగిన ఆ ఫోటోపై సామాజిక మాధ్యమాలలో రకరకాల ఆరోపణలు వినిపించాయి.. వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని మెజార్టీ నెటిజన్లు వ్యాఖ్యానించారు. దీంతో ఇది ఎక్కడికో దారి తీస్తుందని భావించిన మస్క్ స్పందించక తప్పలేదు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం న్యూయార్క్ నగరంలో అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకకు ఇటలీ ప్రధాని జార్జియం లోని హాజరయ్యారు. ఆమెకు అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ పురస్కారం అందించారు. ఈ పురస్కారాన్ని మస్క్ జార్జియాకు అందించారు.. అ పురస్కారం ఆమెకు అందించడం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని మాస్క్ వ్యాఖ్యానించారు. అనిపిస్తున్న భౌతిక అందం కంటే.. జార్జియా మనసు మరింత అందమైనదని.. పురస్కారం అందించిన తర్వాత మాస్క్ వ్యాఖ్యానించారు. జార్జియా మెలోని నమ్మకమైన వ్యక్తి అని.. నిజమైన స్నేహాన్ని చూపిస్తారని.. వాస్తవమైన జీవితాన్ని ఆస్వాదిస్తారని మస్క్ ప్రశంసలు కురిపించారు. జార్జియా మెలోనిని తాను ఇష్టపడతానని.. ఇటలీ కోసం ఆమె కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాలలో నమ్మకానికి జార్జియా మెలోని పెద్ద పీట వేశారని.. విశ్వసనీయతకు పునాదిరాళ్లు పరిచారని పేర్కొన్నారు. అయితే తాను ఈ వ్యాఖ్యలు చేసినతమాత్రాన ఆమెతో డేటింగ్ చేసినట్టు కాదని మస్క్ వ్యాఖ్యానించారు. మరోవైపు మస్క్ ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జార్జియా మెలోనీ కూడా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి స్పందించారు. మస్క్ చేసిన ట్వీట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

    వివాహం జరిగింది కానీ..

    మస్క్ టెస్లా, న్యూరా లింక్స్, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ ఎక్స్ వంటి కంపెనీలతో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీమంతుడిగా ఉన్నాడు. మొదటి సంపాదన 219 బిలియన్ డాలర్లకు పై మాటే. 2023 లోనే అతడు దాదాపు 81.8 బిలియన్ డాలర్లు సంపాదించాడు.. మస్క్ కు ఏడుగురు సంతానం. ఇందులో ఆరుగురు అబ్బాయిలు. ఒక అమ్మాయి. మస్క్ కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్ ద్వారా అయిదుగురు అబ్బాయిలను కన్నాడు. 2008లో విల్సన్ తో మాస్క్ విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత అమెరికన్ నటి తాలులా రిలే తో డేటింగ్ మొదలుపెట్టాడు. 2010లో వీరి వివాహం జరిగింది. 2012లో విడాకులు తీసుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ 2013లో మళ్ళీ వారు వివాహం చేసుకున్నారు. 2016లో విడిపోయారు. 2018లో సింగర్ గ్రిమ్స్ ను వివాహం చేసుకున్నాడు. 2020లో ఆమె ద్వారా ఆరవ కుమారుడిని కన్నాడు. ఆ తర్వాత ఆమె ద్వారా ఓ కుమార్తెకు తండ్రి అయ్యాడు. 2021 లో వీరిద్దరూ విడిపోయారు.

    &