
టాలీవుడ్ లో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ ఏడాది దసరాకే రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయింది. ఎలాగూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఎప్పటి నుండో జరుగుతుంది కాబట్టి, అది కూడా దాదాపు పూర్తీ అయింది. ఇక ఎటొచ్చి మిగిలింది ప్యాచ్ వర్క్. అందుకే ఎట్టిపరిస్థితుల్లో దసరాకి ఈ భారీ సినిమాని రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు రాజమౌళి.
గ్రాఫిక్స్ కూడా వచ్చే వారంతో దాదాపుగా పూర్తి అవుతాయి. అయితే, అసలు సమస్య ఒక్కటే.. దేశమంతా థియేటర్లు ఓపెన్ అవాలి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఫ్యాన్ ఇండియా మూవీ. కాగా దేశమంతా థియేటర్లు త్వరలోనే తెరుచుకుంటాయని ఇప్పటికే రాజమౌళికి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. పైగా అమెరికాలో కూడా థియేటర్లు నడుస్తున్నాయి.
దీనికితోడు ఈ గ్యాప్ లో పలు తెలుగు, హిందీ, సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి, జనం కూడా థియేటర్స్ కి రావడం అలవాటు చేసుకుంటారు. సో.. ముందు ప్రకటించిన తేదీ అక్టోబర్ 13 నాడే ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయడం సినిమాకే ప్లస్ అని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. అందుకే సైలెంట్ గా రాజమౌళి అండ్ టీం అక్టోబర్ 13న మా సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని మిగిలిన మేకర్స్ కి మెసేజ్ పాస్ చేస్తున్నారు.
ఎందుకంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజున తమ సినిమా రిలీజ్ ని ఏ మేకర్ ప్లాన్ చేసుకోవడానికి ఇష్టపడదు. అందుకే రాజమౌళి టీమ్ తమ సినిమా రిలీజ్ అప్ డేట్ కి సంబంధించి మొదటి నుండి మిగిలిన మేకర్స్ తో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వస్తోంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ నిలవడం విశేషం.