Tollywood Movie Updates 08.09.2021 : టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ సినిమా కబుర్లు !

Tollywood Movie Updates: నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్స్ విషయానికి వస్తే.. తెలుగు హీరో నుంచీ నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తో మళ్లీ రొమాన్స్ చేయాలని ఆశ పడుతుంది కంగనా. ఈ హాట్ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే.. మళ్లీ తనతో కలిసి నటించాలని ఉందని దర్శకుడు పూరి జగన్నాథ్ గారికి చెప్పాను. మరి చూడాలి, ప్రభాస్ నుంచి ఆ ఛాన్స్ వస్తుందేమో’ […]

Written By: admin, Updated On : September 8, 2021 11:51 am
Follow us on

Tollywood Movie Updates: నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్స్ విషయానికి వస్తే.. తెలుగు హీరో నుంచీ నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తో మళ్లీ రొమాన్స్ చేయాలని ఆశ పడుతుంది కంగనా. ఈ హాట్ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే.. మళ్లీ తనతో కలిసి నటించాలని ఉందని దర్శకుడు పూరి జగన్నాథ్ గారికి చెప్పాను. మరి చూడాలి, ప్రభాస్ నుంచి ఆ ఛాన్స్ వస్తుందేమో’ అంటూ మొహమాటం లేకుండా చెప్పుకొచ్చింది కంగనా. గతంలో కంగనా – ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ అనే చిత్రంలో కలిసి నటించారు.

‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ సినిమా మొదలుకానుంది. ఎప్పుడో సినిమా చేస్తున్నా అని రవితేజ చెప్పినా, ఇప్పటివరకూ డేట్స్ ఫిక్స్ చేయలేదు. అయితే, తాజాగా రవితేజ నక్కిన సినిమాకి డేట్స్ ఇచ్చేశాడు. అక్టోబర్ 2 నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో మొదలు కానుంది.

తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి ( Atlee) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షారుఖ్‌ ఖాన్ సరసన ‘లేడీ సూపర్ స్టార్ నయనతార’ నటిస్తోంది. ఈ సినిమాతో నయనతార మొదటిసారి బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే, ఈ సినిమాలో విలన్ గా రానా దగ్గుబాటి నటించబోతున్నాడట.

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. కాగా వినాయక చవితికి స్పెషల్ గా ‘ఆచార్య’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ దసరాకి ఉండే అవకాశం ఉంది.

నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాని దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ రానుంది. ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.