F3 Movie: ‘ఎఫ్ 2’ సినిమా రూ. 80 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. గ్రాస్ విషయానికి వస్తే రూ. 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నిర్మాత దిల్ రాజుకు లాభాల పంట పండించింది. అందుకే, ‘ఎఫ్ 3’ అంటూ సీక్వెల్ ను చాలా భారీగా ప్లాన్ చేశారు. దానికి తగ్గట్టుగానే.. ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. అదనపు షోల కోసం బయ్యర్లు పోటీ పడుతున్నారు. అటు యూఎస్ లోనూ 350 పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా ప్రీమియర్స్ పడబోతున్నాయి. పైగా మే 26న సాయంత్రమే ఈ షోలు వేయనున్నారు.

ప్రైమ్ మీడియా యూఎస్ వాళ్లు అక్కడ ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ హక్కుల తీసుకున్న సంగతి తెలిసిందే. భారీ మొత్తానికి వాళ్ళు ఈ సినిమాని కొన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టారు. కారణం, ఈ సినిమాకి అన్ని ప్లస్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. వరుసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు.
Also Read: NTR Blockbuster Movie Sequel: బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ లో ఎన్టీఆర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
అలాగే, సినిమా ఫుల్ ఫన్ తో సాగే పక్కా ఫ్యామిలీ డ్రామా. పైగా ‘విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్’ కలిసి నటిస్తున్న చిత్రం. ఈ కలయికలో వచ్చిన ‘ఎఫ్ 2’ సూపర్ హిట్ అయ్యింది. అన్నిటికి మించి దర్శకుడు అనిల్ రావిపూడికి, నిర్మాత దిల్ రాజుకు బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీతో పాటు పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టారు.

అదే విధంగా ఎఫ్ 2లోని వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ అవుతుంది. ఈ సీక్వెల్ లోనూ తమన్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా. తమన్నా, మెహ్రిన్ లు… వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయి.
ఈ సినిమాలోని ఓ స్పెషల్ రోల్ లో సోనాలి చౌహాన్ నటిస్తోంది. అలాగే, ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడు. మొత్తానికి నవ్వుల హరివిల్లును ఈ చిత్రం చూపించబోతుంది. మరి ఏ రేంజ్ విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read:Dil Raju: ‘ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ’లతో పాన్ వరల్డ్ సినిమాలు !



[…] Also Read: F3 Movie: ‘ఎఫ్ 3’ యూఎస్ ప్రీమియర్స్ రెడీ.. ఎ… […]
[…] […]