https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: అలాంటి వారినే బిగ్​బాస్​ టైటిల్స్ ఎందుకు వరిస్తున్నాయి?

Bigg Boss 5 Telugu: ఒకే ఇంట్లో ఓ ఫ్యామిలీగా 20 మంది. కానీ ఒకరి గురించి ఒకరికి అసలు తెలేదు. అలా కొన్ని వారాల పాటు ఫోన్​, టీవీ, ఇలా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చూపించే రియాలిటీ షో బిగ్​బాస్​. ఈ షోను ఎంత మంది హేట్​ చేస్తారో.. అంతకు రెట్టింపు అభిమానులు కూడా ఉన్నారు. చుట్టూ పదుల సంఖ్యలో కెమెరాలు, 24 గంటలు కంటెస్టెంట్లను గమిస్తూంటాయి. వారు వారిలో ఉండటమే బిగ్​బాస్​లో అతిపెద్ద  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 10:32 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: ఒకే ఇంట్లో ఓ ఫ్యామిలీగా 20 మంది. కానీ ఒకరి గురించి ఒకరికి అసలు తెలేదు. అలా కొన్ని వారాల పాటు ఫోన్​, టీవీ, ఇలా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చూపించే రియాలిటీ షో బిగ్​బాస్​. ఈ షోను ఎంత మంది హేట్​ చేస్తారో.. అంతకు రెట్టింపు అభిమానులు కూడా ఉన్నారు.

    Bigg Boss 5 Telugu

    చుట్టూ పదుల సంఖ్యలో కెమెరాలు, 24 గంటలు కంటెస్టెంట్లను గమిస్తూంటాయి. వారు వారిలో ఉండటమే బిగ్​బాస్​లో అతిపెద్ద  టాస్క్​. అందులోంచి ఓ గంట పాటు ప్రేక్షకులకుచూపించి.. ఓట్ల ద్వారా తమకిష్టమైన వ్యక్తిని గెలిపించడమే అసలైన గేమ్​. ఈ క్రమంలోనే ఫైనల్​ విజేతెవరో తెలుస్తుంది. అయితే, తాజాగా బిగ్​బాస్​ సీజన్​5లో కూడా ప్రేక్షకాదరణ పొందిన సన్నీ టైటిల్​ విన్నర్​గా నిలిచారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. బిగ్​బాస్​ జరిగిన 5 సీజన్లలో ఆవేశపరులకే టైటిల్​ ఇస్తున్నట్లు నెటింట్లో టాక్ వినిపిస్తోంది.

    Also Read:  బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఎందుకు గెలిచారు? ఎలా గెలిచారు.? అసలు కారణాలేంటి?

    తొలిసారి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వచ్చిన బిగ్​బాస్​ సీజన్​1లో శివబాలాజీ కూడా ఒక్కోసారి ఆవేశాన్ని హద్దులు మీరి ప్రవర్తించడం అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో బిగ్​బాస్​నే తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. చివరకు అతనే టైటిల్​ విన్నర్​ కావడం విశేషం.

    Bigg Boss 1 Title Winner Shiva Balaji and Host Jr NTR

    ఆ తర్వా త నాని హోస్ట్​గా వ్యవహరించిన సీజన్​2లో కౌశల్​ వ్యవహరించిన శైలి పెద్ద చర్చకే దారి తీసింది. అతని ఆవేశానికి ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలూ లేకపోలేదు. కానీ, ఆ ఆవేశమే పోను పోనూ అతన్ని ప్రేక్షకులను దగ్గరగా చేసింది. కౌశల్​ ఆర్మీ అంటూ ఓ పెద్ద టీమ్​నే క్రియేట్​ చేసుకునేలా చేసింది. దీంతోనే కౌశల్​ బిగ్​బాస్ విజేతగా నిలిచారు.

    Bigg Boss 2 Title Winner Kaushal, Host Nani and Guest Venkatesh

    Also Read: ఆ నలుగురు బిగ్ బాస్ విన్నర్స్ ఏం సాధించారు?.. సన్నీ పరిస్థితి ఏమవుతుంది?

    ఆ తర్వాత మూడో సిజన్​ నుంచి కింగ్ నాగార్జున బిగ్​బాస్​లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి తాజా సీజన్​ వరకు ఆయనే వ్యాఖ్యతగా వ్యవహిస్తున్నారు. కాగా, మూడో సీజన్​లో రాహుల్​ సిప్లిగంజ్​కి ఉన్న ఆవేశానికి హైస్​లో ఎక్కవ రోజులు ఉండటం కూడా కష్టమని అందరూ భావించారు. కానీ, అతను కూడా విజేతగా నిలిచాడు. ఆ తర్వాత మిస్టర్ కూల్ అనిపించుకున్న అభిజిత్​కు బిగ్​బాస్​ ట్రోఫీ దక్కింది ఇప్పుడు మరోసారి కోపిస్టిగా పేరు తెచ్చుకున్న సన్నికి బిగ్​బాస్​ టైటిల్​ వరించింది.

    Bigg Boss 3 Title Winner Rahul Sipliganj, Host Nagarjuna and Guest Chiranjeevi

    Bigg Boss 4 Title Winner Abijeeth, Host Nagarjuna and Guest Chiranjeevi

     

    దీన్ని బట్టి చూస్తుంటే.. హౌస్​లో నిజాయితీ కంటే.. తమలోని ఎమోషన్స్​ను కంట్రోల్ చేసుకుంటూ.. తమలో మార్పు తెచ్చుకునే వారినే ప్రజలు, బిగ్​బాస్ గమనించి వారిని గెలిపిస్తున్నారన్నది అర్థమవుతోంది. ఇప్పటి వరకు గెలిచిన వారంతా కూడా తమలో ఆవేశాన్ని అనుచుకుని.. హౌస్​లో అందరి మన్ననలను పొంది చివరకు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారు.

    Bigg Boss 5 Title Winner VJ Sunny, Host Nagarjuna

    Also Read: షణ్ముఖ్ కి టైటిల్ దూరం అవ్వడానికి కారణం అదేనా…