Comedian Prudhvi Raj: ఒక్కోసారి చేసిన తప్పులే మనల్ని తలకిందులు చేస్తాయి. ప్రతికూల పరిస్థితులను, ఇబ్బందులను తెచ్చిపెడతాయి. థర్టీ ఈయర్స్ పృధ్వీ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. అనవసరంగా పొలిటికల్ ట్రాప్ లో పడిన ఆయన అటు రాజకీయాలకు దూరమయ్యారు. ఇటు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి. రెండిటికీ చెడ్డ రేవడిలా ఆయన పరిస్థితి తయారైంది. తాజాగా ఆయనకు మరో షాక్ తగిలింది. భార్యకు రూ.8 లక్షల భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆయన సినిమాల్లో నిలదొక్కుకునేందుకు భార్య కుటుంబం నుంచి ఆర్థిక సాయం పొందారు. తీరాగా సినిమాల్లో బిజీ అయిన తరువాత భార్యను విడిచిపెట్టారు. దీంతో ఆమె విజయవాడలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.

పృధ్వీకి దెబ్బమీద దెబ్బ తగులుతునే ఉంది. కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి ఊపుమీద ఉన్న సమయంలో పృధ్వీ రాజకీయాల వైపు వెళ్లారు. వైసీపీ ట్రాప్ లో పడి ప్రత్యర్థులను ఆడిపోసుకున్నారు. అటు సినీ ప్రముఖులను సైతం వదల్లేదు. పోనీ వైసీపీ సర్కారు అందించిన నామినేటెడ్ పదవిని సైతం సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో ఉద్వాసనకు గురయ్యేసరికి ఆయనకు తత్వం బోధపడింది. రాజకీయంగా ఓదార్చే వారు లేకపోయారు. ఇటు సినిమాలపరంగా కూడా బాగా దెబ్బతిన్నారు. అయితే దానిని అధిగమించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. సినిమాల్లో వేషాల కోసం ఎవరినైతే తిట్టారో.. వారి ప్రాపకం కోసం పడరాని పాట్లుపడ్డారు. ఇప్పుడిప్పుడే ఆయనకు సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభించాయి.
అయితే ఇలా నిలదొక్కుంటున్న తరుణంలో ఇప్పుడు కుటుంబసమస్య వచ్చి పడింది. భార్య పెట్టిన కేసు విచారణ హీయరింగ్ కు వచ్చింది. విజయవాడ ఫ్యామిలీ కోర్టు తుది తీర్పు వెలువరంచింది. భార్యకు నెలకు రూ.8 లక్షల భరణం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. 2017 నుంచి ఐదేళ్ల పాటు ఏరియర్స్ ను కూడా చెల్లించాలని సూచించింది. దాదాపు రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రతీనెల పదో తేదీలోగా రూ.8 లక్షల భరణం క్రమం తప్పకుండా చెల్లించాలి. అయితే ప్రస్తుతం అరకొర సినిమాలే చేతిలో ఉన్నాయి. ఈ సమయంలో అంత మొత్తం కట్టాలంటే కత్తిమీద సామే. అలాగని ఇవ్వకుంటే కోర్టు ధిక్కారం కేసు కింద వస్తుంది. అందుకే మనిషన్నాక కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోమంటారు. కానీ మన థర్టీ ఈయర్స్ పృధ్వీ ముందూ వెనుకా చూసుకోకుండా వ్యవహరించారు. ఏరికోరి కష్టాలను తెచ్చుకున్నారు.