Sivakarthikeyan: కోలీవుడ్ స్టార్ హీరోలలో మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు శివ కార్తికేయన్..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన శివ కార్తికేయన్ ఒక మిమిక్రి ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించి..ఆ తర్వాత తమిళ టెలివిజన్ లో ప్రసారమయ్యే ఎన్నో టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించి..అలా వచ్చిన ఫేమ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు..కెరీర్ ప్రారంభం లో అన్ని కమెడియన్ రోల్స్ వచ్చేవి..వాటి ద్వారానే ఇండస్ట్రీ లో స్థిరపడి ఆ తర్వాత మెల్లగా హీరో అవకాశాలను సంపాదించాడు.

హీరోగా హిట్టు మీద హిట్టు కొడుతూ, ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈరోజు తమిళనాడు లో టాప్ 5 స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు..ఒక మిమిక్రీ ఆర్టిస్టు సూపర్ స్టార్ రేంజ్ కి ఎదగడం అంటే సాధారణమైన విషయం కాదు..ఇప్పుడు కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో విజయ్ తర్వాత అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న ఏకైక హీరో శివ కార్తికేయన్ మాత్రమే.
మన టాలీవుడ్ లో కూడా ఈయన హీరో గా నటించిన రెమో, డాక్టర్ మరియు డాన్ వంటి సినిమాలు తెలుగులో డబ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా జాతి రత్నాలు వంటి సెన్సషనల్ హిట్ ని తీసిన అనుదీప్ తో ‘ప్రిన్స్’ అనే సినిమా చేసాడు..ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెసఫుల్ గా రన్ అవుతుంది..ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రొమోషన్స్ తెలుగు లో కూడా చాలా గట్టిగానే చేసారు.

అలా ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ మాట్లాడుతూ ‘మీరు అంటే నచ్చని వాళ్ళు ఈ ప్రపంచం లో ఎవరు ఉండరు ఏమో..అందరూ మిమల్ని ఇష్టపడుతారు’ అని చెప్తుంది..అప్పుడు శివ కార్తికేయన్ దానికి సమాధానం చెప్తూ ‘నన్ను ద్వేషించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు..ఒకసారి నా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే టైంలైన్ లో నన్ను మాత్రమే కాకుండా నా ఇంట్లో వాళ్ళని కూడా వదలకుండా బూతులు తిడుతున్నారు..అవి చూసినప్పుడు మొదట్లో చాలా బాధేసేది..కానీ నన్ను ద్వేషించే వారికంటే నన్ను అభిమానించే వారే ఎక్కువ..అందుకే చిన్న స్థాయి నుండి వచ్చి ఈరోజు ఈ స్థానం లో కూర్చున్నాను..ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి అనేది మన చేతిలోనే ఉంటుంది..నేను ఎప్పుడు పోజిటివిటీ ని తీసుకుంటాను, నెగటివిటీ ని వదిలేస్తాను..కానీ ఫామిలీ ట్రోల్ల్స్ వెయ్యడం మంచిది కాదు..మీకు కుటుంబాలు ఉన్నాయి..రేపు మిమల్ని కూడా అలా ఎవరైనా అనొచ్చు..అప్పుడు చాలా బాధపడుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు శివ కార్తికేయన్.