Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీసన్ 6 లో ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఎంత వాడవేడిగా సాగిందో మన అందరికి తెలిసిందే..ఈ వారం ఆరంభం కాగానే బిగ్ బాస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ టాస్కుని పెడచెవిన పెట్టిన హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ శిక్షిస్తూ,కెప్టెన్సీ టాస్కుని రద్దు చేసి కబడి, టాగ్ ఆఫ్ వార్ మరియు సర్వైవల్ టాస్కులను పెట్టి హౌస్ లో హీట్ ని రగిలించాడు..అలా చప్పగా సాగిపోతున్న ఈ వారం ని బిగ్ బాస్ ఇచ్చిన కోటింగ్ మూలంగా కాస్త ఆసక్తికరంగా సాగింది.

ప్రతియొక్క ఇంటి సభ్యులు తమని తాము నిరూపించుకోవడానికి నూటికి నూరు శాతం కృషి చేసారు..ఇక ఈ వారం బిగ్ బాస్ కి కోపం తెప్పించి కెప్టెన్సీ టాస్కుని రద్దు అయ్యేలా చేసిన ఇంటి సభ్యులను వీకెండ్ లో అక్కినేని నాగార్జున బాగా తిడుతాడని అందరూ ఊహించారు..కానీ నాగార్జున గారు మాత్రం చాలా కూల్ గా ఈ వీకెండ్ ఎపిసోడ్ ని పూర్తి చేసాడు.
అయితే ప్రతిఇంటి సభ్యుడిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి హౌస్ లో ‘మోస్ట్ డిజెర్వేడ్ కంటెస్టెంట్’ ఎవరు..’మోస్ట్ అన్ డిజెర్వేడ్’ కంటెస్టెంట్ ఎవరు అని అడిగారు..మోస్ట్ డిజెర్వేడ్ కంటెస్టెంట్స్ గా రోహిత్ , శ్రీహన్ , గీతూ మరియు సూర్య ని ఇంటి సభ్యులు ఎక్కువగా నామినేట్ చెయ్యగా మోస్ట్ అన్ డిజెర్వేడ్ ఇంటి సభ్యులుగా వాసంతి , రాజ్ శేఖర్,అర్జున్ కళ్యాణ్ మరియు మెరీనా ని ఎక్కువగా నామినేట్ చేసారు.

నామినేట్ అయినా ఈ 8 మందిలో మోస్ట్ డిజెర్వేడ్ కంటెస్టెంట్ గా ఎక్కువ ఓట్లు శ్రీహాన్ కి రాగా , మోస్ట్ అన్ డిజెర్వేడ్ కంటెస్టెంట్ గా మెరీనా కి అత్యధిక ఓట్లు వచ్చాయి..మిగిలిన ఇంటి సబ్యులకు ఎలాంటి ఓట్లు రాకపోవడం తో డీజెర్వేడ్ లిస్ట్ లోకి వెళ్ళడానికి మీకు మీరు వాదించుకొని వెళ్ళండి..ఒకవేళ ఓడిపోతే మాత్రం అన్ డిజెర్వేడ్ లోకి వెళ్లారు అని నాగార్జున గారు అడుగుతారు..అయితే ఈ పోలింగ్ బట్టి మనకి అర్థం అయ్యింది ఏమిటి అంటే శ్రీహన్ ఆట ని ఇంటి సభ్యులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే విషయం.
ఇక ఈ వారం నామినేషన్స్ నుండి సేఫ్ ఎవరు అయ్యారు అనేది ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో చూపించలేదు..రేపు ఆదివారం రోజు జరగబొయ్యే స్పెషల్ ఎపిసోడ్ లో నామినేషన్స్ నుండి ఎవరు సేఫ్ అయ్యారు మరియు ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది తెలుస్తుంది.