Samantha: అందాల తార సమంత తన దూకుడు పెంచుతోంది. సినిమాల పరంగానే కాకుండా ప్రచార కర్తగా కూడా తన ప్రయాణం కొనసాగిస్తోంది. నాగచైతన్యతో విడాకుల తరువాత ఇష్టారాజ్యంగా ముందుకు వెళ్తోంది. తాను ఎంచుకున్న కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి తన సంపాదన మరింత పెంచుకుంటోంది. ఇందులో భాగంగా పలు విదేశీ సంస్థలకు కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు ఒప్పుకుంటోంది. దీంతో ఇటీవల ఆమె పోస్టు చేసిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పెళ్లికి ముందే సమంత మూడు చోట్ల టాటూ వేయించుకుంది. చేతి మణికట్లు, వీపు మీద, నడుము పైన చై అనే అక్షఱంతో పచ్చబొట్టు వేయించుకుంది. ఆమె పోస్టు చేసిన ఫొటోల్లో ఆ అక్షరం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో విడాకుల తరువాత ఆ టాట్లు తొలగించుకుంటుంది అనుకున్నారు అంతా. కానీ అలా చేయలేదు. చైతు గుర్తుగా వాటిని అలాగే ఉంచుకుంది. సమంత సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలతో అందరికి మత్తెక్కిస్తోంది.
Also Read: Pawan Kalyan- Vehicles: మనల్ని ఎవడ్రా ఆపేది.. బరిలోకి పవన్ కళ్యాణ్ కొత్త వాహనాలు
బర్బెర్రీ అనే బ్రిటిష్ సంస్థకు ప్రచార కర్తగా మారి వాటి ఉత్పత్తుల కోసం ప్రచారం నిర్వహిస్తోంది. సోషల్ మీడియా ద్వారా తన ఫొటోలు షేర్ చేస్తోంది. దీంతో అభిమానులకు అందుబాటులో ఉంటూ తన అనుభవాలు పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో సమంత కుర్రకారును రెచ్చగొడుతూ ఫొటోలు పెడుతూ రెచ్చగొడుతోంది. ఈ క్రమంలో సమంత, చైతు లు మళ్లీ కలుస్తారా? లేక ఇలాగే దూరంగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి సమంత తన సినిమాల ద్వారా దూసుకుపోతోంది.
ఇదిలా ఉండగా సమంత తన భవిష్యత్ ను వేగంగా మార్చుకుంటోంది. సినిమాలతో బిజీగా ఉంటూ వాణిజ్య ప్రకటనల్లో కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది. మరోవైపు చైతు కూడా సినిమాల ద్వారా ముందుకు వెళ్తున్నాడు. తనకెంత మంది హీరోయిన్లు ఆఫర్ ఇస్తున్నా సమంత ను మర్చిపోలేకపోతున్నాడని తెలుస్తోంది. అందుకే ఎందరు అతడిని రెచ్చగొట్టాలని చూస్తున్నా చైతు మాత్రం రెచ్చిపోవడం లేదు. దీంతో సమంత , చైతన్య మళ్లీ కలుస్తారనే అభిప్రాయం అందరిలో వస్తోంది.
Also Read: Anasuya Bharadwaj: అనసూయ అందాలు అదరహో … ఎదపై టాటూ చూపిస్తూ నాటీ ఫోజులిచ్చిన హాట్ యాంకర్!