Singer Ramana Gogula : ఒకప్పుడు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో యూత్ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేసిన సంగీత దర్శకులలో ఒకరు రమణ గోగుల. ఈయన స్వరపరిచే పాటలు, అప్పటి వరకు ఉన్న ట్రెండ్ కి చాలా బిన్నంగా ఉండేవి. ఒక సరికొత్త మ్యూజిక్ ని ఆయన ఆడియన్స్ కి అందించే ప్రయత్నం చేసి గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. అభిమానులు ఈయన్ని కేవలం ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే కాదు, ఒక గాయకుడిగా కూడా విపరీతంగా అభిమానిస్తారు. ఈ గాత్రం లో ఎదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమాకి ఈయనే సంగీతం సమకూర్చేవాడు. ముఖ్యంగా ఈయన గాత్రం కి, పవన్ కళ్యాణ్ గాత్రం కి చాలా దగ్గర పోలికలు ఉండేవి. ఈయన గొంతు వినిపించినప్పుడల్లా మనకి పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చేవాడు. ఆ రేంజ్ లో ఉండేది. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈయన్ని విపరీతంగా ఆరాధిస్తారు.
1998 వ సంవత్సరం లో విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘ప్రేమంటే ఇదేరా’ అనే చిత్రం ద్వారా ఈయన ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆ సినిమా అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ చిత్రంలోని ప్రతీ పాట అప్పట్లో యువతని ఉర్రూతలూ ఊగించాయి. ఇక ఆ తర్వాత ఈయన తమ్ముడు, బద్రి, యువరాజు, జానీ, అన్నవరం, లక్ష్మి, యోగి, వాసు ఇలా ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ని అందించిన ఆయన సుమంత్ ని హీరో గా పెట్టి బోణి అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడంతో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రమణ గోగుల, మళ్ళీ 2013 వ సంవత్సరం లో వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాకి సంగీతం అందించాడు. ఈ సినిమా ఆల్బం కూడా పెద్ద హిట్ అయ్యింది కానీ, మళ్ళీ ఆయన సినిమాలను కొనసాగించలేదు.
అయితే ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి పట్టుబట్టి తాను విక్టరీ వెంకటేష్ తో తీస్తున్న లేటెస్ట్ చిత్రంలోని ‘గోదారి గట్టు’ అనే పాటని పాడించాడు. ఈ పాట ప్రస్తుతం ఎంతటి సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ లో 30 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. చాలా కాలం తర్వాత రమణ గోగుల గొంతు విన్న ఆడియన్స్ ఎంతో సంబరపడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో కి మరోసారి పాటలు పాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రమణగోగుల కి నటాషా అనే కూతురు ఉంది. ఈమెకి కూడా తండ్రి లాగానే మ్యూజిక్ అంటే పిచ్చి. ఇంస్టాగ్రామ్ లో తరచూ యాక్టీవ్ గా ఉంటూ, పలు మ్యూజిక్ బిట్స్ చేస్తూ ఉంటుంది. చూసేందుకు హీరోయిన్ లాగ ఉండే ఈ అమ్మాయి, సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే కచ్చితంగా వేరే లెవెల్ కి వెళ్తుంది. ఈ అమ్మాయి టాలెంట్ ని మీరే మీ కళ్ళతో స్వయంగా చూడండి.