Pushpa 2
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం విడుదలై అప్పుడే మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ మూడు వారాలు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఫాస్టెస్ట్ వంద కోట్లు, 200 కోట్లు రేంజ్ దాటి, ఫాస్టెస్ట్ వెయ్యి కోట్లు, ఫాస్టెస్ట్ 1700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్నటితో ఈ సినిమాలో ఇండియా లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. మూడు వారాల తర్వాత అయినా జోరు తగ్గుతుందేమో, మనం కొత్త సినిమాలను విడుదల చేసుకుందామని ప్లాన్ చేసుకొని మరీ తమ సినిమాలను విడుదల చేసిన కొంతమంది దర్శక నిర్మాతలకు ‘పుష్ప 2’ చిత్రం నిరాశని మిగిలించింది.
ఎందుకంటే ఈ చిత్రం కొత్త సినిమాలను సైతం డామినేట్ చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఉపేంద్ర UI, థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దుమ్ము లేపే వసూళ్లను రాబడుతున్న మలయాళం హీరో ఉన్ని ముకుందన్ ‘మార్కో’, మోహన్ లాల్ ‘బరోజ్’, కిచ్చ సుదీప్ పాన్ ఇండియన్ చిత్రం ‘మ్యాక్స్’,బాలీవుడ్ లో ‘బేబీ జాన్’ ఇలా ఎన్నో కొత్త సినిమాలు ‘పుష్ప 2 ‘ మేనియా ని అడ్డుకోలేకపోయాయి. ‘పుష్ప 2 ‘ చిత్రానికి గంటకు 8 వేలకు పైగా టికెట్స్ బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోతుంటే, మిగిలిన సినిమాలకు కనీసం నాలుగు వేల టికెట్స్ కూడా గంటకు అమ్ముడుపోవడం లేదు. దీనిని బట్టి చూస్తే ఆడియన్స్ కి ఇప్పటికీ కూడా ‘పుష్ప 2 ‘ చిత్రం మాత్రమే మొదటి ఛాయస్ అని అనిపిస్తుంది. 22 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
తెలుగు వెర్షన్ లో ఇప్పటి వరకు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 514 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 307 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. 22 వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ కి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 310 కోట్ల రూపాయలకు జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో మూడు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. ఇక హిందీ వెర్షన్ వసూళ్ల విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 820 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 710 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఓవర్సీస్ కూడా కలిపి మొత్తం మీద ఈ చిత్రానికి 1700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.