Raja Ravindra: ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో సంచలనం నమోదైంది. తెలంగాణ కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. తెలుగు రాష్ట్రాలలో రాజా రవీంద్ర పేరు మారుమ్రోగుతుండగా… ఆయనను పలు మీడియా సంస్థలు ఇంటర్వ్యూ కోసం సంప్రదిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో షో గురించి, హోస్ట్ ఎన్టీఆర్ గురించి… రాజా రవీంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మనం ఇక్కడ కూర్చొని షో చూస్తున్నప్పుడు అంత టెన్షన్ అనిపించదు. అక్కడ ఎన్టీఆర్ ముందు హాట్ సీట్ లో కుర్చున్నాక మెదడు పని చేయదు. చుట్టూ ఉన్న వాతావరణం, సెట్, సౌండ్స్ తో మనకు సగం బ్రెయిన్ మాత్రమే పని చేస్తుంది. అయితే ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి. ఆయన ప్రశ్నలు అడిగిన తర్వాత మనల్ని తికమకపెట్టరు. అడిగిన ప్రశ్నను చక్కగా చర్చించేవారు. గతంలో ఈ షో చూసినప్పుడు నేను నమ్మలేదు. అయితే నా భార్య బలవంతంతో ప్రశ్నలకు సమాధానాలు పంపాను. ఓ రోజు కాల్ వచ్చింది.. ఆ విధంగా షోలో పాల్గొనే అవకాశం దక్కిందని రాజా రవీంద్ర తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ… కోటీశ్వరుడు అంటే తనకు నచ్చడం లేదు, సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర అన్న పిలుపునే ఇష్టపడతాను. నేను గెలుచుకున్న ఈ అమౌంట్ లో కొంత భాగం పిల్లల సంక్షేమం కోసం ఉపయోగిస్తాను. ఇటీవల నా కొడుకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. జాతీయస్థాయి ఎయిర్ రైఫిల్ షూటర్ అయిన నేను, భారత్ కు ఈ విభాగంలో గోల్డ్ మెడల్ అందించాలనే లక్ష్యంతో ఉన్నాను. ఆ నా లక్ష్యం కోసం మిగిలిన అమౌంట్ ఖర్చు చేస్తాను.. అని రాజా రవీంద్ర తెలిపారు.
Also Read: Uppena Director: నందమూరి హీరోతో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా!
కాగా పేరుకు గెలుచుకుంది కోటి అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఆయనకు దక్కేది రూ. 68.8 లక్షల మాత్రమే. ఇన్కమ్ టాక్స్ రూపంలో 31.2 శాతం ప్రైజ్ మనీలో కట్ చేస్తారు. ఇక అనేక పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్న రాజా రవీంద్రకు ఆ అనుభవం, కోటి గెలుచుకోవడానికి ఉపయోగపడిందట.
Also Read: Kangana: మోదీ వ్యవసాయ చట్టాల నిర్ణయంపై కంగన అలా.. తాప్సీ ఇలా!