Jobs: BFUHS MO రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ 2024: 400 ఖాళీలు భర్తీ.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ!

బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(బీఎఫ్‌యూహెచ్‌ఎస్‌)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 400 పోస్టుల భర్తీకి నోటిఫకేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.www.bfuhs.ac.in లో సెప్టెంబర్‌ 04వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Written By: Raj Shekar, Updated On : August 28, 2024 2:47 pm

Jobs

Follow us on

Jobs: నీట్‌ కౌన్సిలింగ్‌ మొదలైన నేపథ్యంలో వైద్య కళాశాలలు తమ కలాశాలల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నాయి. సిబ్బంది పూర్తిస్థాయిలో లేకుంటే కళాశాలలకు విద్యార్థులను అలాట్‌ చేయడం లేదు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కళాశాలు పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా, తాజాగా పంజాబ్‌కు చెందిన బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(బీఎఫ్‌యూహెచ్‌ఎస్‌) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద మొత్తం 400 ఖాళీల నోటిఫికేషన్‌ వెలువడింది. విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు వంటి కళాశాల మెడికల్‌ ఆఫీసర్‌ వద్ద నోటిస్‌ బోర్డుపై, కళాశాల వెబ్‌జైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 23 ఆగస్టు 2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ – ఫీజు చెల్లింపు: 04 సెప్టెంబర్‌ 2024
సీబీటీ పరీక్ష తేదీ : 08 సెప్టెంబర్‌ 2024

విద్యా అర్హత:
దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఎంబీబీఎస్‌ డిగ్రీని కలిగి ఉండాలి లేదా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాచే గుర్తింపు పొందిన తత్సమానం ఉండాలి.

వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుండి 37 సంవత్సరాలు ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 04న లేదా అంతకు ముందు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ మోడ్‌ ద్వారా రిక్రూట్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు భవిష్యత్తు సూచన కోసం చివరకు సమర్పించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ యొక్క ప్రింటౌట్‌ తీసుకోవచ్చు.

ఖాళీల వివరాలు

మెడికల్‌ ఆఫీసర్‌ – 400 పోస్టులు

వర్గం పోస్ట్‌ల సంఖ్య బ్యాక్‌లాగ్‌
బీసీ(వెనుకబడిన తరగతులు) 20 6
బీసీ(ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ – మాజీ సైనికులు) 2 4
బీసీ(మహిళ) 13 7
ఈఎస్‌ఎం (మాజీ సైనికులు) 19 1
ఈఎస్‌ఎం(మహిళ) 9 1
స్వాతంత్య్ర సమరయోధుడు 3 –
జీసీ(సాధారణ వర్గం) 29 34
జీసీ(మహిళ) 2 9
సీజీ(మహిళ) 34 7
ఎస్‌సీ(ఎంఅండ్‌బీ) 17 17
ఎస్‌సీ(ఆర్‌అండ్‌వో) 13 16
ఎస్‌సీ(ఈఎస్‌ఎం) 3 10
ఎస్సీ (మహిళ) 13 10
ఎస్‌సీ(క్రీడలు) 1 8
క్రీడలు (మహిళ ) – 1
మొత్తం 315 85