Ester Noronha: భీమవరం బుల్లోడు మూవీలో హీరోయిన్‌గా నటించిన ఎస్తర్ నోరోన్హ.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని విషయాలను బయటపెట్టేసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఎస్తర్ ఏమి చెప్పింది ? ఎందుకు ఆమె కామెంట్స్ వార్తల్లో నిలిచాయి అంటే.. తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎస్తర్ ఘాటు కామెంట్స్ చేసింది.

ఎస్తర్ తనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడానికి కారణాలు తెలిపింది. ‘ఇండస్ట్రీలో ఆఫర్స్ కావాలంటే ఒకరు ఇద్దరు హీరోలు కమిట్‌మెంట్ అడిగారు. ఒప్పుకోకపోతే కేరీర్ ముగిసిపోతుంది, ఇక్కడే ఆగిపోతావు, ముందుకెళ్లలేవని బెదిరించారు. సినిమా అంటే నాకిష్టం కానీ అదే జీవితం కాదు. దానికోసం దిగజారడం అవసరం లేదు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తున్నాయి’ అని తెలిపింది.
Also Read: అయ్యో పాపం గౌతం సవాంగ్? బదిలీ చేయడంలో ఆంతర్యమేమిటో?
ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘తెలుగులో కేవలం మూడు సినిమాలే చేశాను. కన్నడంలో కొన్ని మూవీస్ చేశాను’. అయితే, నన్ను కమిట్ మెంట్ అడగడం నాకు నచ్చలేదు అంటూ ఎస్తర్ మొత్తానికి ఓపెన్ గా చెప్పింది. ఏది ఏమైనా తెలుగు వెండితెర పై బోల్డ్ గా ఉండని అమ్మాయిలకు ఆదరణ ఉండదు అని చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట.

మరి పద్దతిగా ఉన్న అమ్మాయిలు హీరోయిన్లుగా ఎందుకు రాణించలేక పోతున్నారు అంటే ఇలాంటి సంఘటనలే అంటూ ఎస్తర్ ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. లేకపోతే.. భీమవరం బుల్లోడు లాంటి హిట్ మూవీలో హీరోయిన్‌గా నటించిన ఎస్తర్ నోరోన్హకు ఎందుకు అవకాశాలు రావు. ఆమె మంచి నటి కూడా. అయినా ఆమె హీరోయిన్ గా రాణించలేకపోవడం బాధాకరమైన విషయం.
Also Read: హీరో కావాల్సిన వ్యక్తి మోహన్ బాబు వల్ల బస్సు ట్రావెల్స్ నడిపి కోటీశ్వరుడయ్యాడు.. ఎవరంటే?
[…] Chinajiyar KCR: ‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణ గూరూజీ-భక్తుడి మధ్య చిచ్చుపెట్టింది. చినజీయర్ స్వామి, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య దూరాన్ని పెంచింది. తెలంగాణలో ప్రతిష్టించిన ఈ విగ్రహం, ఆలయాన్ని జాతీయస్థాయికి ఇనుడించేలా చేయడంలో కేసీఆర్ సహకారం మరువలేనిది. ఎందుకంటే ఆ దేవాలయం కట్టింది హైదరాబాద్ శివారులోనే.. అక్కడి రోడ్లు, మౌళిక వసతులు కల్పించింది కేసీఆర్ సర్కార్ నే.. అయితే మొత్తం క్రెడిట్ మాత్రం మోడీ సర్కార్ కే వెళ్లింది. అదే కేసీఆర్ లో కోపానికి కారణమైందని.. ఆయనతో చినజీయర్ కు చెడిందని వార్తలు వచ్చాయి. […]