Homeఎంటర్టైన్మెంట్Break For RRR Records: ప్చ్.. కేజీఎఫ్ 2 వల్ల 'ఆర్ఆర్ఆర్' రికార్డులకు...

Break For RRR Records: ప్చ్.. కేజీఎఫ్ 2 వల్ల ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులకు బ్రేక్

Break For ‘RRR’ Records: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం దేశంలో భారీ వసూళ్లని సాధిస్తూ దూసుకుపోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ చూసి భారతీయ సినీ లోకమంతా.. సంతోషంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. అయితే మరో వారంలో కేజీఎఫ్‌2, బీస్ట్‌ విడుదల కారణంగా ఈ చిత్ర వసూళ్లకి బ్రేక్‌ పడనుంది. ప్రస్తుతం దేశంలో దంగల్‌ (రూ. 2024 కోట్లు) వసూళ్ల పరంగా టాప్‌లో ఉండగా, ఆ తర్వాత బాహుబలి-2 (రూ.1810 కోట్లు) రెండో స్థానంలో ఉంది.

Break For 'RRR' Records
Break For ‘RRR’ Records

ఇప్పటికి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూళ్లే సాధించింది. దీంతో ప్రభాస్‌ బాహుబలి-2ని బ్రేక్‌ చేయడం అసాధ్యమనే చెప్పాలి. మొత్తానికి కేజీఎఫ్ 2 దెబ్బకు ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులకు బ్రేక్ పడబోతోంది. మరోపక్క `కేజీఎఫ్’ సిరీస్ పై రోజురోజుకు క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. ముఖ్యంగా `కేజీఎఫ్ 2′ విడుదలకు ముందే రికార్డులు బద్దలుకొడుతుంది.

Also Read: Samantha Yashoda Movie Release Date: ఆగస్టు 12న ‘యశోద’గా రాబోతున్న సమంత

ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు తన పేరిట సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకుంది. గ్రీస్‌ లో విడుదలయ్యే మొదటి దక్షిణ భారతీయ చిత్రం ఈ సినిమానే కానుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ యూకే (UK)లో ఇప్పటికే ప్రారంభమైంది. కాగా కేవలం 12 గంటల్లోనే 5,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి, ఇది భారతీయ సినిమాల్లోనే అత్యధికం కావడం విశేషం.

అంటే.. ఆర్ఆర్ఆర్ కంటే `కేజీఎఫ్’కే ఎక్కువ క్రేజ్ ఉంది అని అర్ధం అవుతుంది. షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రాబోతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా పై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఎలాగూ మొదటి పార్ట్ బంపర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలకు కారణం ఇదే. పైగా మొదటి పార్ట్ ను మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉండబోతున్నాయి.

Break For 'RRR' Records
Break For ‘RRR’ Records

విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక రోల్స్ లో కనిపించబోతున్నారు. అన్నిటికీ మించి దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ పై అందరికీ రెట్టింపు నమ్మకం క్రియేట్ అయింది. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. కోలార్ బంగారు గ‌నుల నేపథ్యంలో మాఫియా క‌థతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Also Read:Naina Ganguly- Apsara Rani: ఇదేం వీడియోరా నాయ‌నా.. నైనా గంగూలీ, అప్స‌రా రాణిల ఘాటు రొమాన్స్‌, లిప్ లాక్స్‌..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

  1. […] Ranbir- Alia Wedding: రణబీర్, ఆలియా భట్ పెళ్లి ముహూర్తం ఖరారు అయిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. అయితే, తాజాగా ఆ రచ్చకు ముగింపు పలకడానికి ఈ క్రేజీ కపుల్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల మూడో వారంలో రణబీర్ – ఆలియా జంటగా మారబోతున్నారు. ఇప్పటికే అటు రణబీర్ ఇంట్లో, ఇటు అలియా ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది. […]

  2. […] Tollywood Best Female Characters: తెలుగు సినిమాల పై ఎప్పటినుంచో ఒక అపవాదు ఉంది. హీరోయిన్ పాత్రకు కథలో ప్రాముఖ్యత ఉండదు అని. హీరోయిన్ మహానటి అయినా బాగా నటించడానికి ఆమెకు అవకాశం ఉండదు అని. అయితే.. మీకు తెలుసా ? ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు పవర్ ఫుల్ ఫిమేల్ రోల్స్ ఎక్కువగా ఉన్నది తెలుగు సినిమాల్లోనే. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular