Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షోలో అవిక్షన్ పాస్ కోసం పోటీ నడుస్తుంది. ఇంకా నాలుగు వారాల గేమ్ మాత్రమే మిగిలి ఉండగా ఫైనల్ కి వెళ్లేందుకు అవిక్షన్ పాస్ కీలకం కానుంది. అర్జున్ అవిక్షన్ పాస్ గెలుచుకోగా… బిగ్ బాస్ మరలా మెలిక పెట్టాడు. టాప్ ఫైవ్ అని హౌస్ మేట్స్ మెజారిటీ నిర్ణయించబడిన హౌస్ మేట్స్ తో అర్జున్ పోటీ పడాలని చెప్పారు. షేక్ బేబీ షేక్ అనే టాస్క్ లో అర్జున్ తన ప్రత్యర్థిగా యావర్ ని ఎంచుకున్నాడు. ఈ టాస్క్ లో యావర్ గెలవడంతో అర్జున్ అవిక్షన్ పాస్ కోల్పోయాడు. యావర్ చేతికి అవిక్షన్ పాస్ వచ్చింది.
అంతటితో అయిపోలేదు. యావర్… ప్రశాంత్, శోభ, శివాజీ, ప్రియాంకలపై కూడా గెలిచి అవిక్షన్ పాస్ సొంతం చేసుకోవాలి. రెండో గేమ్ స్కూటర్ పై సవారీ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ తో యావర్ పోటీపడ్డాడు. ఈ గేమ్ లో కూడా యావర్ గెలిచాడు. మూడో టాస్క్ ఐ లవ్ బర్గర్ టాస్క్ లో శోభా శెట్టితో పోటీపడ్డాడు. ఎవరు ఎక్కువ బర్గర్స్ తింటే వారిదే విజయం. శోభ అప్పటికే భోజనం చేయడంతో తన వల్ల కాలేదు. ఆమె తినలేక వాంతి చేసుకుంది. యావర్ మూడో టాస్క్ లో కూడా విజయవంతంగా తెలిచాడు.
ఇక ఫైనల్ టాస్క్ లో మిగిలిన శివాజీ, ప్రియాంకలతో యావర్ పోటీపడ్డారు. టేక్ ఏ బౌ టాస్క్ లో బంతులను బ్యాలన్స్ చేయాలి. ఈ టాస్క్ లో ప్రియాంక బాల్స్ మొదట క్రిందపడిపోయాయి. అనంతరం శివాజీ, యావర్ ఉన్నారు. సంచాలక్ గా ఉన్న ప్రశాంత్, శోభ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే… శివాజీ డిస్టర్బ్ అయ్యాడు. మాట్లాడవద్దని ప్రశాంత్ మీద గొడవపడ్డాడు. చివరికి శివాజీ కూడా బాల్స్ క్రింద పడేశాడు. అయితే తనను గేమ్ లో డిస్టర్బ్ చేశారని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
అయితే చివరిగా మిగిలిన యావర్ కి అవిక్షన్ పాస్ దక్కాలి. గేమ్ నిబంధనల ప్రకారం ఎవరు ఆడి గెలిచారో చెప్పాలని బిగ్ బాస్ సంచాలకులు కోరాడు. వారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే శివాజీ, యావర్ కంటే రూల్స్ ప్రకారం ఆడిందంటూ అవిక్షన్ పాస్ ప్రియాంకకు కట్టబెట్టే కుట్రకు శోభ తెరలేపిందనే మాట వినిపిస్తోంది. సంచాలకులదే తుది నిర్ణయం కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.