Emraan Hashmi : అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటైన ‘ఓజీ'(They Call Him OG) మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నిన్నటి నుండి షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. కాసేపటి క్రితమే ఆయన ముంబై లో షూటింగ్ స్పాట్ లో కనిపించిన ఒక వీడియో సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపింది. అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఓజీ మూవీ షూటింగ్ శరవేగంగా సాగిపోతుంది, జూన్ 10 లోపు ఈ సినిమా పూర్తి అవుతుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే ఈ చిత్రం లో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) కి డెంగ్యూ ఫీవర్ వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన్ని వెంటనే షూటింగ్ స్పాట్ నుండి హాస్పిటల్ కి తరలించారు. డెంగ్యూ ఫీవర్ వస్తే రెండు వారాల వరకు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
Also Read : కన్నీళ్లు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణమా?
కాబట్టి ఈ చిత్రం షూటింగ్ రెండు వారాల పాటు ఆగే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ని జూన్ 8 లోపు పూర్తి చెయ్యాలని అనుకున్నారు. జూన్ 10 నుండి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి డేట్స్ కేటాయించాడు. ఇప్పుడు షూటింగ్ రెండు వారాల వరకు ఆగే పరిస్థితి ఉండడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి కేటాయించిన డేట్స్ ఓజీ కి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదల తేదీని కూడా నిర్మాతలు రీసెంట్ గానే ప్రకటించారు. సెప్టెంబర్ 25 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవ్వడం తో ఏ క్షణం లో అయినా ఆయన మళ్ళీ బిజీ అవ్వొచ్చు. అప్పుడు ఓజీ చిత్రానికి డేట్స్ కేటాయించడంలో ఆలస్యం జరగొచ్చు. అదే కనుక జరిగితే మళ్ళీ ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
ఇక పోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలం నుండి ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మూడు నెలలకే ఓజీ చిత్రాన్ని చూడబోతున్నాము, తక్కువ గ్యాప్ లో రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే అదృష్టం అంటూ పవన్ అభిమానులు మురిసిపోయారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఇమ్రాన్ హష్మీ కి అస్వస్థత ఏర్పడడం తో ఎక్కడ ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల అవ్వదో అని భయపడుతున్నారు ఫ్యాన్స్. మరోపక్క ఇమ్రాన్ హష్మీ సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడాలని కూడా సోషల్ మీడియా సాక్షిగా ప్రార్థిస్తున్నారు.