Homeఎంటర్టైన్మెంట్Emotional Sequences: నెటిజన్లను ఆకట్టుకుంటున్న సన్నివేశాలు !

Emotional Sequences: నెటిజన్లను ఆకట్టుకుంటున్న సన్నివేశాలు !

Emotional Sequences: Scenes that impress netizens!

Emotional Sequences: ఎంత గొప్ప సినిమా అయినా కొన్ని సన్నివేశాలు మాత్రమే ఎప్పటికి గుర్తిండిపోతాయి. ఆ సన్నివేశాలను ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తారు. అందుకే ఆ సన్నివేశాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి. మరీ ప్రస్తుతం ఏ సినిమాలోని ఏ సన్నివేశాలు డిజిటల్ ఫాట్ ఫామ్స్ పై బాగా ఆదరణకు నోచ్చుకుంటున్నాయో చూద్దాం.

స్వయంకృషి సినిమాలో కొన్ని సీన్స్ ను ప్రస్తుతం నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. అయితే, స్వయంకృషి సినిమాలో కంటెంట్ కారణంగానే జనానికి ఆ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమాలో మెయిన్ పాయింట్ ఏమిటంటే.. మనిషికి ముఖ్యమైనది డబ్బు కాదు, తాను నేర్చుకున్న విద్య మాత్రమే అని ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు.

‘డబ్బు ఎవరైనా దోచుకుంటారు. కానీ మనం నేర్చుకుని సంపాదించిన విజ్ఞానం ఎవరు దొంగలించలేరు’. ఈ పాయింట్ ఈ జనరేషన్ కే కాదు, ఏ జనరేషన్ కైనా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇక ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా హృదయానికి హత్తుకునేలా ఉంటాయి.

అలాగే సాగరసంగమం సినిమాలో సన్నివేశాలు కూడా నెటిజన్లు రిపీటెడ్ గా చూస్తున్నారు. ఈ సినిమాలో గొప్ప మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో హీరో తను నేర్చుకున్న కళ కోసం, ఆలాగే ఆ కళ తోనే తన ప్రాణాన్ని అర్పిస్తాడు. ఆ సన్నివేశాలు బాగా ఎమోషనల్ గా బాగా ఆకట్టుకుంటాయి.

ఇక శంకరాభరణం సినిమాలో క్లైమాక్స్ ను కూడా ప్రేక్షకులు బాగా చూస్తున్నారు. ఇక మహిళా ప్రేక్షకులు ఎక్కువగా చూస్తోన్న సినిమా మాతృదేవోభవ. ఈ సినిమాలో చివరి అంకంలో తను కన్న పిల్లలని వేరొకరికి దత్తత ఇచ్చి న తరువాత, ఒక వికలాంగుడుగా మిగిలిన బాబుతో కలిసి అందరి పిల్లల్ని కలుస్తుంది ఆ తల్లి. ఆ సన్నివేశాలు మనసుని కదిలిస్తాయి. ఈ సన్నివేశాలకు ఎందరో అభిమానులు ఉన్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version