Eleven Movie Review : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తుంటారు. నవీన్ చంద్ర లాంటి నటుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. 15 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఆయన స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. అడపాదడప హీరోగా చేస్తూనే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ముందుకు సాగుతున్నాడు…ఇక ఇప్పుడు ఆయన హీరోగా వచ్చిన ఎలెవన్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే వైజాగ్ నగరంలో సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి…ఒక మర్డర్ సిటీ లో జరిగితే మరొకటి సిటీ ఔట్ కట్స్ లో జరుగుతుంది…ఇక ఈ కేసు ను హ్యాండిల్ చేస్తున్న అరవింద్ (నవీన్ చంద్ర) అన్ని మర్డర్స్ ను ఒకే ఒకడు చేస్తున్నాడు వాడు సైకో అంటూ వివరాలను కనుక్కునే ప్రయత్నం చేస్తాడు…మరి ఆయన ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసింది…అసలు ఆ సైకో కిల్లర్ ఎందుకని మర్డర్స్ చేస్తున్నాడు వాడి మోటివ్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఈ కథ ను ఎంచుకున్న విధానం బాగుంది…కథ లో కూడా కాస్త కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేశారు…సీన్స్ లో సస్పెన్స్ ను బాగా బిల్డ్ చేశారు…అలాగే ఆ మర్డర్స్ ను చూపించిన విధానం కూడా బాగుంది…హీరో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఎంగేజింగ్ గా చూపించారు…అయితే ఈ సినిమాలో సస్పెన్స్ సీన్స్ తో పాటు సెంటిమెంటల్ సీన్స్ ను కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు…
అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అయినప్పటికీ సెకండాఫ్ చాలా బాగుంది…ముఖ్యంగా చిన్న పిల్లల ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి…ట్విస్టు లు కూడా ఎవ్వరు ఊహించిన రేంజ్ లో ఉండటంతో వాటికి ప్రేక్షకులు బాగా థ్రిల్ ఫీల్ అవుతారు…ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ బాగున్నాయి…మొత్తానికైతే ఈ సినిమా సెకండాఫ్ బాగుండటం తో సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నవీన్ చంద్ర సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా నటించి మెప్పించాడు… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఒక ఇంటెన్స్ తో నటిస్తూ ఉంటాడు…ఇక అలానే ఈ సినిమాలో కూడా ఒక సీరియస్ ఫేస్ తో హంతకుడిని పట్టుకోవడానికి ఆయన ప్రయత్నించే విధానం అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది…ఇక విలన్ గా నటించి వ్యక్తి నటన కూడా చాలా బాగుంది…శశాంక్ నటన తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించింది…రవి వర్మ పాత్ర కూడా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడం లో కీలక పాత్ర వహించాడనే చెప్పాలి…తన నటన చాలా బాగా సెట్ అయింది…మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది… సస్పెన్స్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ ను ఎలివేట్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేసింది…సినిమాటోగ్రఫీ విషయం లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది…ప్రతి షాట్ సినిమాలో ఉన్న కంటెంట్ ను ఎలివేట్ చేసే విధంగా ఉంది…అందుకే ప్రేక్షకుడు థియేటర్ లో సినిమా చూస్తున్నంత సేపు ఆ షాట్స్ ను చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు…ఇక ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ప్రతి సీన్ ఎంత డ్యూరేషన్ తో ఉండాలి. ఎక్కడ ఎడిట్ కట్ పడాలి అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని షాప్ ఎడ్జ్ లో కట్ చేశారు…
ప్లస్ పాయింట్స్
కథ
నవీన్ చంద్ర
సెకండాఫ్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
కొన్ని అనవసరపు సీన్స్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5