
పాపులర్ తెలుగు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించినట్లు తెలుస్తోంది. కరోనా వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆగస్టు5 చెన్నై ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కిద్దిరోజుల కిందట ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని బాలు కుమారుడు చరణ్ వెల్లడించారు. అయితే ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.