DVV Danayya-SS Rajamouli: డైరెక్టర్ రాజమౌళి తో ఒక సినిమా తియ్యాలంటే కచ్చితంగా భారీ బడ్జెట్ ని ఏర్పాటు చెయ్యాల్సిందే నిర్మాతలు.ఎందుకంటే ఆయన విజన్ కి తగ్గ టెక్నాలజీ,తారాగణం మరియు టెక్నిషియన్స్ ఇలా అన్నీ అందుబాటులో ఉండాల్సిందే.లేకపోతే రాజమౌళి సినిమా చెయ్యదు.రాజమౌళి తో సినిమా అంటే ఏ నిర్మాత అయినా ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా క్షణం ఆలోచించరు.ఫైనాన్షియర్స్ కూడా కోట్లు కుమ్మరిచేస్తారు.అలా డీవీవీ దానయ్య #RRR మూవీ కి 350 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేసాడు.థియేట్రికల్ రైట్స్ అన్నీ ప్రాంతాలకు కలిపి దాదాపుగా 500 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు.

నాన్ థియేట్రికల్ డిజిటల్ + సాటిలైట్ రైట్స్ నుండి మరియు 500 కోట్లు.ఇలా విడుదలకు ముందే పెట్టిన డబ్బులకు అదనంగా 650 కోట్ల రూపాయిల లాభాలను ఆర్జించాడు.ఆయన బిజినెస్ ఏ విధంగా చూసుకున్న సేఫ్..రీసెంట్ గా జపాన్ లో ఈ చిత్రం విడుదలై అక్కడ కూడా సెన్సేషన్ సృష్టించింది.జపాన్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా మరో వంద కోట్ల రూపాయిలు లాభం.
ఇలా ఇంత లాభాలు వచ్చినప్పటికీ ఆయన ఆస్కార్ అవార్డ్స్ ప్రొమోషన్స్ కోసం ఒక్క రూపాయి కూడా తన జోబులో నుండి తియ్యడానికి ఇష్టపడలేదట.అందుకు కారణం రాజమౌళి తో ఆయనకీ ఏర్పడిన కొన్ని విబేధాలే అని ఫిలిం నగర్ లో ఒక పుకారు షికారు చేస్తుంది..లాభాల్లో వాటాలు పంచుకునే విషయం లో రాజమౌళి మరియు దానయ్య మధ్య చిన్న మనస్పర్థలు వచ్చాయని,అప్పటి నుండి రాజమౌళి #RRR కి సంబంధించి ఏ కార్యక్రమం లో కూడా దానయ్య ని పిలవడం కానీ, ఆయన ప్రస్తావన తీసుకొని రావడం కానీ చెయ్యలేదని టాక్.
రీసెంట్ గా ఆస్కార్ అవార్డ్స్ ప్రొమోషన్స్ కి కూడా రాజమౌళి తన సొంత ఖర్చులతోనే ప్రమోట్ చేసాడని, అందుకు సుమారుగా 80 కోట్లు ఖర్చు అయ్యిందని తెలుస్తుంది.సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై మూవీ టీం కి సంబంధించి ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాల్సిందే.