Duvvada Madhuri: రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ తో ప్రేమాయణం నడుపుతూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన దువ్వాడ మాధురి, ఇప్పుడు సినీ రంగ ప్రవేశం చేసి తన సత్తా ని చాటుకునే పనిలో పడింది. గత ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ రియాలిటీ షో లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి , ఈమె క్రియేట్ చేసిన ఇంప్యాక్ట్ మామూలుది కాదు అనే చెప్పాలి. ఉన్నది కేవలం 3 వారాలే అయినప్పటికీ, హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరినీ దడలాడించింది. అంతే కాదు బిగ్ బాస్ కి రాకముందు ఈమెపై నెగెటివిటీ తారా స్థాయిలో ఉండేది. కానీ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత మాత్రం ఆ నెగెటివిటీ బాగా తగ్గిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదంతా పక్కన పెడితే , ఇప్పుడు ఆమె ‘చీన్ టపాక్ డుం డం’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేస్తోంది. ఇందులో ఆమె గీరమ్మత అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని నేడు ఆ చిత్రం మేకర్స్ విడుదల చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ‘శుభం’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న గవిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు. ఆయన సరసన హీరోయిన్ గా బ్రిగిడా సాగా నటిస్తోంది. ఈ చిత్రానికి వై ఎన్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అదే విధంగా ‘విలేజ్ టాకీస్’ బ్యానర్ పై శ్రీను నాగులపల్లి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిర్మాతగా ఆయనకు ఇదే తొలిసినిమా అనొచ్చు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ హీరోయిన్ సమంత ముఖ్య అతిథి గా విచ్చేసి మొదటి షాట్ కి క్లాప్ కొట్టగా , ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మొదటి షాట్ కి దర్శకత్వం వహించాడు. అదే విధంగా ‘విశ్వంభర’ ఫేమ్ వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేయగా , నందిని రెడ్డి, రచయిత బీవీఎస్ రవి, గౌతమి తదితరులు కలిసి మూవీ టీం కి స్క్రిప్ట్ ని అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని నర్సీ పట్నం లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎలా అయినా ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని చూస్తున్నారు మేకర్స్.
