Durandhar 2 Movie Box Office Collections: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం వచ్చిన దురంధర్ సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘దురంధర్ 2’ సినిమా పెను సంచలనాలను సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. నాలుగు రోజుల్లోనే 800 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక 2,000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడుతుందంటూ చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి ఈ ఒక్క సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని శాసిస్తుంది.
Also Read: నాయకుడంటే ఇలానే ఉండాలనే రీతిలో లోకేష్.. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ ని టాప్ లెవల్లో నిల్చోబెట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం… తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే పోటీని తట్టుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ నిలబడగలుగుతుంది అంటే దానికి కారణం ‘దురంధర్ 2’ సినిమా అనే చెప్పాలి… ఇక ఈ క్రమంలోనే బాహుబలి 2, పుష్ప 2 సినిమా రికార్డ్ లన్ని బ్రేక్ అవుతాయంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా ఒక రికార్డ్ ను క్రియేట్ చేసింది అంటే ఆ సినిమా రికార్డులను బద్దలు కొట్టే సినిమాలు వస్తూనే ఉంటాయి. ‘దురంధర్ 2’ ఆ ఫీట్ ను సాధించబోతుంది. మరి ఈ సినిమా తర్వాత దురంధర్ 2 రికార్డును బ్రేక్ చేయబోయే సినిమాలేవి 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతారా అనేది చర్చనీయంశంగా మారింది.
హీరోలందరు వాళ్లు చేస్తున్న సినిమాలతో పెను ప్రభంజనాన్నీ సృష్టించడానికి రెడీ అవుతున్నారు… కాబట్టి ఇక ముందు రాబోయే సినిమాల మధ్య పోటీ చాలా రసవత్తరంగా సాగబోతుంది…ఇక స్టార్ హీరోలందరు వాళ్ల క్రేజ్ ను పెంచుకోవాలంటే గొప్ప సినిమాలను చేయాల్సిందే…
