Sita Ramam Collections: ‘దుల్కర్ సల్మాన్’ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి, యుద్ధంతో రాసిన ఈ ప్రేమకథ పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, అసలు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అలాగే బింబిసార నుంచి వస్తున్న పోటీ ఈ సినిమాకు ఏ మేరకు ఉంది?. చూద్దాం రండి.

ముందుగా ‘సీతా రామం’ 2nd డే కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: Tollywood Hit Formula: టాలీవుడ్ హిట్ ఫార్ములా: తప్పు ప్రేక్షకులది కాదు.. సినీ మేకర్స్ దేనా?
నైజాం 1.21 కోట్లు
సీడెడ్ 0.74 కోట్లు
ఉత్తరాంధ్ర 0.55 కోట్లు
ఈస్ట్ 0.33 కోట్లు
వెస్ట్ 0.32 కోట్లు
గుంటూరు 0.37 కోట్లు
కృష్ణా 0.31 కోట్లు
నెల్లూరు 0.37 కోట్లు
ఏపీ + తెలంగాణలో ‘సీతా రామం’ 2nd డే కలెక్షన్స్ గానూ 4.14 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 8.28 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.81 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా ‘సీతా రామం’ 2nd డే కలెక్షన్స్ గానూ 5.02 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 10.03 కోట్లను కొల్లగొట్టింది

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16.20 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఈ చిత్రం ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. పైగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాగూర్ లతో పాటు రష్మిక మందన్న కూడా నటించింది. అలాగే హీరో సుమంత్, భూమిక కూడా నటించారు. వీరంతా ఈ సినిమా ప్లస్. మొత్తానికి ఆగస్టు నెల టాలీవుడ్ కి మంచి ఊపు తెచ్చేలా ఉంది. నిన్న రిలీజ్ అయిన ‘సీతా రామం’, బింబిసార కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నాయి.
Also Read:Bimbisara Collections: ‘బింబిసార’ 2nd డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిపోర్ట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు

[…] Also Read: Sita Ramam Collections: ‘సీతా రామం’ 2nd డే కలెక్షన్స్.. … […]
[…] Also Read: Sita Ramam Collections: ‘సీతా రామం’ 2nd డే కలెక్షన్స్.. … […]