https://oktelugu.com/

Dulquer Salman : ఆమె నాతో అసభ్యంగా ప్రవర్తించింది.: దుల్కర్ సల్మాన్

ఈ సందర్భంగా ఓ మహిళపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టాలీవుడ్ నటుడు రానా సైతం ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు వివరాల్లోకి వెళితే..

Written By:
  • NARESH
  • , Updated On : August 20, 2023 / 02:34 PM IST
    Follow us on

    Dulquer Salman : తమిళ హీరో అయినా దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తీసినవి కొన్ని సినిమాలే అయినా ప్రత్యేక హీరో అని అంటారు. లేటేస్ట్ గా ఆయన ‘కింగ్ ఆఫ్ కోథా’ సినిమాతో వస్తున్నాడు. మరో మూవీ ‘గన్స్ అండ్ గులాబ్స్’ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా దుల్కర్ సల్మాన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ మహిళపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టాలీవుడ్ నటుడు రానా సైతం ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు వివరాల్లోకి వెళితే..

    తెలుగులో ‘మహానటి’తో పరిచయం అయిన దుల్కర్ ‘సీతారామం’ సినిమాతో ఇక్కడివారి మనసు దోచుకున్నాడు. సీతారామం తరువాత దుల్కర్ సల్మాన్ కు తెలుగులో ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. దీంతో ఆయన తమిళంలో చేసిన సినిమాలు కూడా తెలుగులో ఆదరిస్తున్నారు. లేటేస్టుగా దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోథా’ సినిమాలో నటించారు. అభిలాస్ జోష్లి డైరెక్షన్లో వస్తున్న ఈసినిమా ఆగస్టు 24న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా దుల్కర్ సినిమా ప్రమోషన్లో జోరుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓఛానెల్ కు ఇచ్చినఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

    తన సినిమాలంటే చాలా మంది ఇష్టపడుతారని, ఈ క్రమంలో తనను కలిసేందుకు ఎంతో మంది అభిమానులు వస్తుంటారని అన్నారు. ఎంత బిజీ ఉన్నా వారితో చిట్ చాట్ చేస్తుంటానని అన్నారు. ఓ కార్యక్రమంలో తనను ఎంతో మంది మహిళా అభిమానులు కలిశారని అన్నారు. కొంత మంది అభిమానుల సెల్పీ పేరిట దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటారని అన్నారు. అయితే ఓ మహిళ మాత్రం తనను అసభ్యకరంగా తాకిందని అన్నారు. ఇలా చేయడం నాకు ఇబ్బందిగా మారిందన్నారు. నాకు 28 వయసు ఉండగానే అమాల్ సోఫియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అన్నారు. అంతకుముందు ఏ అమ్మాయిని చూసినా ఎలాంటి ఫీలింగ్ కలగలేదని చెప్పారు.

    ఇక కింగ్ ఆఫ్ కోథా గురించి రానా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తనను పట్టించుకోనని, ఇవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు అని అన్నారు. కింగ్ ఆఫ్ కోథాలో దుల్కర్ సల్మాన్ కు తోడుగా ప్రసన్న నటిస్తోంది. వీరితో పాటు షబ్బీర్ కల్లక్కల్, గోకుల్ సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, న్యాల ఉష నటిస్తున్నారు. ఈ మూవీని జీ స్టూడియోతో కలిసి దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. జాక్స్ బేజాయ్, షాన్ రెహ్మాన్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు.