Dude Worldwide Closing Collections: ‘లవ్ టుడే’,’డ్రాగన్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నుండి విడుదలైన చిత్రం ‘డ్యూడ్'(Dude Movie). రెండు వరుస హిట్స్ తర్వాత వచ్చే సినిమాకు ఎలాంటి అంచనాలు ఉంటాయో, ఈ సినిమాకు కూడా అంచనాలు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. సినిమా చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ, కాన్సెప్ట్ కొంతమంది ఆడియన్స్ కి నచ్చలేదు. హీరో అలా త్యాగరాజు లాగా మిగిలిపోవడాన్ని అసలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే కమర్షియల్ గా పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది కానీ, ఓవరాల్ గా హిట్ అని అనిపించుకుంది. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని దాదాపుగా 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అంచనాలకు తగ్గట్టుగా టాక్ వచ్చి ఉండుంటే కేవలం వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునేది.
కానీ ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుకి చాలా దగ్గరగా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం నుండి కోటి 30 లక్షలు, ఆంధ్ర ప్రాంతం నుండి 4 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 10 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 19 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు వెర్షన్ వరకు చూసుకుంటే ఈ సినిమా సెమీ హిట్ అనొచ్చు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళ నాడు ప్రాంతం నుండి 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక ప్రాంతం నుండి 7 కోట్ల రూపాయిలు రాబట్టింది.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ ప్రాంతం నుండి 29 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 60 కోట్ల రూపాయలకు జరిగింది. కొన్ని ప్రాంతాల్లో భారీ లాభాలు వచ్చాయి, కొన్ని ప్రాంతాల్లో నష్టాలు రాలేదు, అలా అని లాభాలు కూడా రాలేదు. ఓవర్సీస్ లో మాత్రం మైనర్ నష్టాలను చూడాల్సి వచ్చింది ఈ చిత్రం. ఓవరాల్ గా ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో ఒక సక్సెస్ ఫుల్ చిత్రం అని చెప్పొచ్చు.