Dude Trailer Review: ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు, తమిళం యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ఒక సాధారణ యువకుడు తనని తానూ వెండితెర పై చూసుకున్నట్టుగా అనిపిస్తాది ప్రదీప్ రంగనాథన్ ని చూస్తే. ఇలాంటి ఇమేజ్ దొరకడం సాధారణమైన విషయం కాదు. ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్న మీడియం రేంజ్ హీరోలు కూడా ఇలాంటి ఇమేజ్ ని సంపాదించలేకపోయారు. అలాంటిది కేవెలం రెండు సినిమాలతోనే సంపాదించాడు ప్రదీప్ రంగనాథన్. రెండు చిత్రాలు కూడా వరల్డ్ వైడ్ గా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు ఆయన ‘డ్యూడ్'(Dude Movie) చిత్రం తో ఏకంగా 200 కోట్ల గ్రాస్ పై కన్నేసినట్టుగా అనిపిస్తుంది. దీపావళి కానుకగా ఈ నెల 17 న విడుదల కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ కి యూత్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రదీప్ రంగనాథన్ మార్క్ యాటిట్యూడ్, నటన, ఎమోషన్స్, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ ఈ ట్రైలర్ లో కనిపించాయి. చూస్తుంటే మంచి ఫన్ తో కూడిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తుంది. ఎలా అయితే ప్రదీప్ గత రెండు సినిమాలు మన నిజ జీవితాన్ని గుర్తు చేసే విధంగా ఉన్నాయో, ఈ సినిమా కూడా అదే విధంగా ఉండబోతుందని ట్రైలర్ ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఇందులో హీరోయిన్ గా ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటించింది. ట్రైలర్ చూస్తుంటే వీళ్లిద్దరు మంచి స్నేహితులు లాగా అనిపిస్తున్నారు, ఆ తర్వాత వీళ్ళ మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కూడా మరో హీరోయిన్ గా నటించింది.
ట్రైలర్ లో ప్రదీప్ ,నేహా శెట్టి పెళ్లి పీటలు మీద కూర్చున్నట్టుగా చూపించారు. మమిత బైజుతో ప్రేమాయణం నడిపి, ఈమెతో పెళ్లేంటి?, చూస్తుంటే కాస్త ‘డ్రాగన్’ మూవీ షేడ్స్ కనిపిస్తున్నాయే అనే ఫీలింగ్ మనలో కలగొచ్చు. ప్రదీప్ నటనలో కూడా ఎలాంటి మార్పు లేదు. గత రెండు సినిమాల్లో ఎలా అయితే కనిపించాడో, ఇందులో కూడా అలాగే కనిపించాడు. కానీ ఎమోషన్స్ సరిగ్గా వర్కౌట్ అయితే ఈసారి 200 కోట్ల గ్రాస్ ని అవలీలగా అందుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. తెలుగు లో కూడా దీపావళి కి విడుదల అవుతున్న సినిమాల్లో ఈ చిత్రానికే ఎక్కువ క్రేజ్ ఉంది. కాబట్టి సినిమా పర్వాలేదు, బాగుంది అనే రేంజ్ టాక్ వచ్చినా వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ మార్కుని పూర్తి స్థాయిలో దాటి సూపర్ హిట్ ని అందుకుంటాడని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
