https://oktelugu.com/

Drushyam Movie Esther Anil: ‘దృశ్యం’ భామ ‘ఎస్తేర్ అనిల్’ బయోగ్రఫీ !

Drushyam Movie Esther Anil: ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేష్ చిన్న కూతురు గుర్తుందా ? సీక్వెల్ ‘దృశ్యం 2’ లో కూడా నటించింది ఈ స్మాల్ బ్యూటీ. పేరు ‘ఎస్తేర్ అనిల్’. ఈ మధ్య తాను కూడా హీరోయిన్ వయసుకు వచ్చేశాను అని సింబాలిక్ గా చెప్పడానికి తెగ ఫోటో షూట్లు చేస్తూ నెట్టింట్లో వైరల్ గా మారడానికి నానాపాట్లు పడుతుంది. ఇంతకీ ఈ ‘ఎస్తేర్ అనిల్’ ఎవరు ? ఈమె బయోగ్రఫీ ఏమిటో చూద్దాం. ‘ఎస్తేర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : November 26, 2021 / 04:51 PM IST
    Follow us on

    Drushyam Movie Esther Anil: ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేష్ చిన్న కూతురు గుర్తుందా ? సీక్వెల్ ‘దృశ్యం 2’ లో కూడా నటించింది ఈ స్మాల్ బ్యూటీ. పేరు ‘ఎస్తేర్ అనిల్’. ఈ మధ్య తాను కూడా హీరోయిన్ వయసుకు వచ్చేశాను అని సింబాలిక్ గా చెప్పడానికి తెగ ఫోటో షూట్లు చేస్తూ నెట్టింట్లో వైరల్ గా మారడానికి నానాపాట్లు పడుతుంది. ఇంతకీ ఈ ‘ఎస్తేర్ అనిల్’ ఎవరు ? ఈమె బయోగ్రఫీ ఏమిటో చూద్దాం.

    Drushyam Movie Esther Anil

    ‘ఎస్తేర్ అనిల్’ పర్సనల్ లైఫ్ :

    ఈమెది కేరళ. ‘ఎస్తేర్ అనిల్’ తల్లి సింగర్. ఆమె కొన్ని తమిళ సినిమాల్లో పాటలు కూడా పాడారు. ప్రస్తుతం ‘ఎస్తేర్ అనిల్’ ఫ్యామిలీ చెన్నైలో ఉంటున్నారు. చిన్న తనం నుంచే ‘ఎస్తేర్’ కి నటన అంటే ప్రాణం. అందుకే నటిగా చిన్న వయసులోనే కెరీర్ ను స్టార్ట్ చేసింది.

    సినిమా జర్నీ :

    2010 లో నల్లవన్ చిత్రం ద్వారా ‘ఎస్తేర్ అనిల్’ బాలనటిగా తన కెరీర్‌ని ప్రారంభించింది. దృశ్యం తమిళ వెర్షన్ లో కమల్ చిన్న కూతురిగా ఎస్తర్ అనిల్ నటించి మెప్పించింది. దాంతో తెలుగులో కూడా వెంకీ చిన్న కుమార్తెగా ఆమెను తీసుకున్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్‏గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్.. హీరోయిన్ ‏గా కూడా ఓ సినిమా చేసింది. ఆ మధ్య తెలుగులో వచ్చిన ‘జోహార్’ అనే సినిమాలో ఎస్తర్‏ హీరోయిన్‏గా నటించింది. అయితే, హీరోయిన్ గా ఆమెకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం హీరోయిన్ గా బిజీ అవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

    Drushyam Movie Esther Anil

    ‘ఎస్తేర్ అనిల్’ హాబీ :

    Also Read: ‘దృశ్యం2’లో మెరిసిన ఈ నటి ఎవరో తెలుసా?

    ఎస్తర్ ఎక్కువుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందుకే, తక్కువ సమయంలోనే నెట్టింట మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక తన ఫాలోవర్స్ ను నిత్యం తన ఫొటోలతో అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాషన్ కి తగ్గట్టు అలాగే బ్రాండ్స్ అనుగుణంగా ఫోటోషూట్స్ చేయడం ఎస్తేర్ హాబీ.

    ‘ఎస్తేర్ అనిల్’కి దక్కిన అవార్డ్స్ :

    2015లో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ నుంచి దృశ్యం సినిమాకు గానూ ఆమెకు ఉత్తమ బాలనటి అవార్డు దక్కింది.

    అలాగే, 2016లో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ నుంచి కూడా ‘ఎస్తేర్ ఉత్తమ బాలనటి అవార్డును అందుకుంది.

    Also Read: నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన వెంకటేష్ “దృశ్యం 2 ”

    Tags