https://oktelugu.com/

డ్రగ్స్ పార్టీ.. అడ్డంగా బుక్ అయిన హీరోయిన్ !

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఏమంటా విచారణ చేపట్టారో గాని, ఆ కేసు కొంతమంది హీరోయిన్లకు పెద్ద శాపంగా మారింది. మత్తులో ముంచుతూ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకునే హీరోయిన్లకు ఇప్పుడు కేసుల భయం పట్టుకుంది. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చాటింగ్‌ లో డ్రగ్స్ గురించిన వివరాల పై విచారణ చేయడం.. ఆ రకంగా కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ ప్రకంపనలతో గత కొన్ని రోజులుగా వణికిపోతూ ఉండటం.. ఈ క్రమంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 / 11:45 AM IST
    Follow us on


    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఏమంటా విచారణ చేపట్టారో గాని, ఆ కేసు కొంతమంది హీరోయిన్లకు పెద్ద శాపంగా మారింది. మత్తులో ముంచుతూ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకునే హీరోయిన్లకు ఇప్పుడు కేసుల భయం పట్టుకుంది. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చాటింగ్‌ లో డ్రగ్స్ గురించిన వివరాల పై విచారణ చేయడం.. ఆ రకంగా కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ ప్రకంపనలతో గత కొన్ని రోజులుగా వణికిపోతూ ఉండటం.. ఈ క్రమంలో ప్రముఖ కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలను అరెస్ట్ చేసేయడం.. ఎన్నో అవమానాలు కష్టాలు అనంతరం వారికి బెయిల్ ఇవ్వడం
    లాంటి సంఘటనలు తెలిసిందే.

    Also Read: ప్రభాస్ కోసం దర్శకుడితో పూజ హెగ్డే గొడవ !

    అయితే తాజాగా మరో హీరోయిన్ డ్రగ్ కేసులో అడ్డంగా బుక్ అయింది. ఇంతకీ ఎవరూ ఈ బ్యూటీ అంటే.. కేరళ యంగ్ బ్యూటీ బ్రిస్టీ బిశ్వాస్..ఈమె గురించి మనకు తెలియదు గాని, కేరళ యూత్ కి బాగానే తెలుసు. కుర్రకారుకు అందాలతో కనువిందు చేసే ఈ బ్యూటీ.. మత్తులో కూడా ముంచడానికి పకడ్బందీగా డ్రగ్ వ్యాపారం మొదలుపెట్టిందట. అలా ఓ పార్టీలో అమ్మడు మొత్తానికి బుక్ అయింది. ఇప్పటికే పాపను పోలీసులు పట్టుకుపోయారు. బెయిల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అంటున్నారు. మరి జైల్లో పాప ఎలాంటి ఇబ్బందులు పడుతుందో.

    Also Read: బ్రేకింగ్: రజినీకాంత్ గురించి కీలక అప్ డేట్

    దీనికితోడు ఈ బ్రిస్టీ బిశ్వాస్ ఫోన్ లో నీలి చిత్రాలు, అసభ్యకరమైన ఫోటోలు ఉన్నాయనే వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. పైగా డ్రగ్స్ ను ఈజీగా అమ్మడానికి పాప వాట్సాఫ్ లో ఓ సపరేట్ గ్రూప్ పెట్టి దందా నడిపిస్తోందని కూడా ఈ యంగ్ బ్యూటీ పై ఆరోపణలు వస్తుండటం నిజంగా అందర్నీ షాక్ కి గురి చేస్తోందట. మరి ఈమె వెనుక ఎవరు ఉన్నారో.. లేక ఈ బ్యూటీనే ఈజీ మనీ కోసం ఇలాంటి వ్యవహారాలు చేస్తోందా అనేది చూడాలి. ఇప్పటికే ఈ ఆరోపణల పై పోలీసులు కూడా విచారించేందుకు సిద్దమవుతున్నారు. రేపో మాపో నిజాలు బయటకు రానున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం సినిమా