Esther Anil: విక్టిరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే, ఈ చిత్రంలో వెంకీ చిన్న కూతురుగా నటించిన యువ నటి ‘ఎస్తేర్ అనిల్’ గుర్తు ఉందా ?. ప్రస్తుత టాపిక్ ఆమె గురించే. ఇటీవల ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పెరిగి పెద్దది అయింది లేండి. తాను ఇప్పుడు హీరోయిన్ రేంజ్ ఫిగర్ ని అని చాటి చెప్పడానికి ‘ఎస్తేర్ అనిల్’ సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా గ్లామర్ డోస్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది.

ఈ క్రమంలో తాజాగా ఎస్తేర్ అనిల్ తన జిమ్ వీడియో ఒకటి నెట్టింట పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎస్తేర్ తన నడుము అందాలను ఘాటుగా చూపిస్తూ.. అందాల కేక పుట్టిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అసలు దృశ్యం మూవీలో చూసింది ఈ పాపేనేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఆ రేంజ్ లో అమ్మడు తన అందాలను పెంచింది. పైగా ఎక్స్ పోజింగ్ లో బాగా ముదిరిపోయింది.
‘ఎస్తేర్ అనిల్’ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఈమెది కేరళ. ఈమె తల్లి సింగర్. ఆమె కొన్ని తమిళ సినిమాల్లో పాటలు కూడా పాడారు. ప్రస్తుతం ‘ఎస్తేర్ అనిల్’ ఫ్యామిలీ చెన్నైలో ఉంటున్నారు. చిన్నతనం నుంచే ‘ఎస్తేర్’ కి నటన అంటే ప్రాణం. అందుకే నటిగా చిన్న వయసులోనే కెరీర్ ను స్టార్ట్ చేసింది.

ఎస్తేర్ సినిమా జర్నీ విషయానికి వస్తే.. 2010 లో నల్లవన్ చిత్రం ద్వారా ‘ఎస్తేర్ అనిల్’ బాలనటిగా తన కెరీర్‌ని ప్రారంభించింది. దృశ్యం తమిళ వెర్షన్ లో కమల్ చిన్న కూతురిగా ఎస్తర్ అనిల్ నటించి మెప్పించింది. దాంతో తెలుగులో కూడా వెంకీ చిన్న కుమార్తెగా ఆమెను తీసుకున్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్.. హీరోయిన్ గా కూడా ఓ సినిమా చేసింది.

ఆ మధ్య తెలుగులో వచ్చిన ‘జోహార్’ అనే సినిమాలో ఎస్తర్ హీరోయిన్గా నటించింది. అయితే, హీరోయిన్ గా ఆమెకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం హీరోయిన్ గా బిజీ అవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే విచ్చలవిడిగా అందాల ఆరబోతకు రెడీ అయ్యింది. పైగా తక్కువ సమయంలోనే నెట్టింట మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక తన ఫాలోవర్స్ ను నిత్యం తన ఫొటోలతో అలరిస్తూ ఉంది. ముఖ్యంగా ఫ్యాషన్ కి తగ్గట్టు అలాగే బ్రాండ్స్ అనుగుణంగా ఫోటోషూట్స్ చేయడం ఎస్తేర్ హాబీ.