Rajinikanth And Kamal Haasan: ‘లవ్ టుడే’ అనే చిత్రం తో తెలుగు,తమిళ భాషల్లో భారీ కమర్షియల్ హిట్ ని అందుకొని యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన హీరోలలో ఒకరు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ఈ సినిమాకు ఆయన దర్శకత్వం కూడా వచించాడు. ఈ చిత్రానికి ముందు ఆయన జయం రవి ని హీరో గా పెట్టి కోమలి అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇలా ఒక పక్క డైరెక్టర్ గా, మరో పక్క హీరో గా అద్భుతమైన విజయాలను అందుకొని తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. రీసెంట్ గా ఆయన ఈ ఏడాది ‘డ్రాగన్’ అనే చిత్రం తో మరో భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తో యూత్ ఆడియన్స్ కి ఆయన మరింత చేరువ అయ్యాడు.
రీసెంట్ గా ఆయన ‘lik’ మరియు ‘డ్యూడ్’ వంటి సినిమాల్లో హీరో గా నటించాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వీటిల్లో డ్యూడ్ చిత్రం ఈ నెల 17 న, దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. రీసెంట్ గానే ఆయన ప్రొమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు. ఈ ప్రొమోషన్స్ లో ఆయన సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న కొన్ని రూమర్స్ పై స్పందించాడు. కొద్దిరోజుల నుండి ప్రదీప్ రంగనాథన్ త్వరలోనే రజినీకాంత్(Superstar Rajinikanth), కమల్ హాసన్(Kamal Haasan) భారీ మల్టీస్టార్రర్ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని, ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తి అయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ప్రదీప్ రంగనాథన్ స్పందిస్తూ ‘రజినీ, కమల్ మల్టీస్టార్రర్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం నాకు వచ్చిందో లేదో నేను చెప్పను కానీ, ఈ సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నా ఫోకస్ మొత్తం ఇప్పుడు యాక్టింగ్ మీదనే ఉంది. దర్శకత్వం వైపు ఇప్పట్లో వెళ్లాలని లేదు. ఇక ఈ మల్టీస్టార్రర్ గురించి నాకు పెద్దగా వివరాలేవీ తెలియదు. ఇందులో నేను భాగం కాదు అని మాత్రమే చెప్పగలను . చిన్నతనం నుండి నేను రజినీకాంత్ కి వీరాభిమాని ని. ఆయన ప్రతీ సినిమాని మొదటి రోజు మొదటి ఆట థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడం నాకు అలవాటు. అలా నేను ఆరాధించే సూపర్ స్టార్, డ్రాగన్ చిత్రం లో నా నటన ని చూసి అభినందించాడు. ఒక నటుడిగా ఇంతకు మించిన గౌరవం ఇంకేమి కావాలి’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్ రంగనాథన్.