Bigg Boss 9 double elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ ఎంత వాడావేడి వాతావరణం మధ్య నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ మొదలు అవ్వక ముందు సెలబ్రిటీస్ ని కామనర్స్ బాగా డామినేట్ చేస్తారేమో తమ ప్రవర్తన తో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే కామనర్స్ డామినేషన్ కి పాపం సెలబ్రిటీలు తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది అయితే ఏడ్చేస్తున్నారు పాపం. ఎక్కడి నుండి పట్టుకొచ్చారో కానీ , వీళ్ళను సెలెక్ట్ చేసి లోపలకు పంపించిన జ్యూరీ కి చేతులెత్తి దండం పెడుతున్నారు ప్రేక్షకులు. ఇంకోసారి కామనర్స్ ని బిగ్ బాస్ కి తీసుకొని రమ్మని అడగము, మమ్మల్ని క్షమించండి బాబోయ్ అంటూ సోషల్ మీడియా లో స్టార్ మా ఛానల్ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మొదటి వారం లో శ్రేష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది.
ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకసారి చూస్తే భరణి, ప్రియా, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, సుమన్ శెట్టి,ఫ్లోరా షైనీ మరియు డిమోన్ పవన్ ఉన్నారు. వీరిలో అందరి కంటే తక్కువ ఓటింగ్ తో ఫ్లోరా షైనీ మరియు మర్యాద మనీష్ మధ్య చాలా గట్టి పోటీ ఉంటుందట. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి, వీళ్లిద్దరు హౌస్ నుండి బయటకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కచ్చితంగా వెళ్తారని కూడా అంటున్నారు. ఇక అందరికంటే అత్యధిక ఓట్లతో సుమన్ శెట్టి కొనసాగుతుండగా, దాదాపుగా ఆయనతో సమానమైన ఓటింగ్ తో భరణి కూడా కొనసాగుతున్నాడు. ఇక మూడవ స్థానం లో డిమోన్ పవన్ ఉన్నాడట. ఇతనికి ఈ వారం మొత్తం నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. గత వారం లో డేంజర్ జోన్ లోకి వచ్చాడు.
అయినప్పటికీ కూడా టాప్ 3 లో కొనసాగడానికి కారణం రీతూ చౌదరి నామినేషన్స్ లో లేకపోవడమే. ఈమె నామినేషన్స్ లో లేకపోవడం వల్ల ఈమెని అభిమానించే వారంతా డిమోన్ పవన్ కి ఓట్లు గుద్దుతున్నారు. ఇక ఆ తర్వాతి స్థానం లో ప్రియా శెట్టి మరియు మాస్క్ మ్యాన్ హరీష్ కొనసాగుతున్నారు. వీళ్లిద్దరి ఓటింగ్ లో కూడా భారీ తేడాలు లేవు. వచ్చే వారం నామినేషన్స్ లోకి వస్తే మాత్రం, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని బయటకు పంపేందుకు రెడీ గా ఉన్నారు ఆడియన్స్. మరి ఏమి జరగబోతుందో చూడాలి. మాస్క్ మ్యాన్ హరీష్ అన్నం మీద అలక మాని, గత రెండు రోజుల నుండి తింటున్నాడు. కానీ ఇప్పటికీ ఆయన సంజన , భరణి లను అసలు గౌరవించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే మాస్క్ మ్యాన్ బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ నుండి విపరీతమైన తిట్లను ఎదురుకోవాల్సి ఉంటుంది.