OG overseas advance bookings: సరిగా మరో 6 రోజుల్లో అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఒక గ్లింప్స్ వీడియో, మూడు పాటలు తప్ప, టీజర్, ట్రైలర్ వంటివి ఏమి రాలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఓవర్సీస్ లో సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ మొత్తం కలిపి లక్ష టిక్కెట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ చివరి ఆరు రోజుల్లో మరో లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఎందుకంటే నార్త్ అమెరికా లో ఇంకా పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. సోమవారం నుండి మొదలు అవ్వొచ్చు అని అంటున్నారు. ఇంకా దుబాయ్ మరియు గల్ఫ్ దేశాల్లో బుకింగ్స్ మొదలు కావాల్సి ఉంది. మన టాలీవుడ్ కి అవి అతి పెద్ద మార్కెట్స్.
అక్కడ కూడా బుకింగ్స్ మొదలయ్యాక ఇంకా ఏ రేంజ్ ర్యాంపేజ్ ఉంటుందో అని అభిమానులు సోషల్ మీడియా లో ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు. గ్రాస్ లెక్కల్లో చూస్తే ఓజీ చిత్రానికి ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 20 కోట్ల రూపాయలకు పైగానే వచ్చాయట. అంటే ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వకముందే, ఓవర్సీస్ లో 20 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చింది అన్నమాట. అంతే కాదు ఈ చిత్రం ఓవర్సీస్ నాన్ బాహుబలి 2 రికార్డు ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బాహుబలి 2 చిత్రానికి ప్రీమియర్ షోస్ + మొదటి రోజుకి కలిపి 10 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత కల్కి, పుష్ప 2 , దేవర వంటి చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ‘ఓజీ’ చిత్రం కల్కి రికార్డు ని అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 6 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపుగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్ మూవీ గా ఈ చిత్రం నిలుస్తుందని, పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజు 170 నుండి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేసినట్టే. పెద్ద పెద్ద కాంబినేషన్స్ కి కూడా సాధ్యం అవ్వని అరుదైన రికార్డ్స్ కేవలం పవన్ కళ్యాణ్ కారణంగా బ్రేక్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డ్స్ ని నెలకొల్పబోతుందో చూడాలి.