Bigg Boss 9 Telugu Double Elimination: రీసెంట్ గానే మొదలైన ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) షో బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే గొడవలు మొదలయ్యాయి. కేవలం ఒక్క గుడ్డు కోసం కంటెస్టెంట్స్ అందరూ ఎంతలా కొట్టుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న నామినేషన్స్ లో కూడా ఈ అంశం చుట్టూనే తిరిగింది. సామాన్యులంతా కలిసి భరణి ని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. ఇది భరణి కి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఇక పోతే రెండవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లిపోవడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యుల లిస్ట్ చూస్తే భరణి, సుమన్ శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్,ప్రియా, డిమోన్ పవన్, ఫ్లోరా షైనీ. వీరిలో ఎవరెవరు డేంజర్ జోన్ లో ఉన్నారు?, ఎవరు టాప్ ఓటింగ్ లో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం.
Also Read: మూడేళ్లు..’ఓజీ’ చిత్రం కోసం సుజిత్ ఎన్ని బాలీవుడ్ ఆఫర్స్ ని వదులుకున్నాడో తెలుసా!
ఓటింగ్ ప్రకారం అయితే ప్రస్తుతం సుమన్ శెట్టి కి ఒక రేంజ్ లో ఓట్లు పడుతున్నాయని టాక్. ఆ తర్వాత సుమన్ శెట్టి రేంజ్ లో కాకపోయినా, ఆయనకు దగ్గరగా ఓటింగ్ ని సొంతం చేసుకుంటున్న మరో కంటెస్టెంట్ భరణి. వీళ్ళిద్దరే ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే మర్యాద మనీష్, ఫ్లోరా షైనీ, వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. మాస్క్ మ్యాన్ హరీష్, ప్రియా, డిమోన్ పవన్ లకు కూడా భారీ ఓటింగ్ ఏమి పడట్లేదు. వీళ్ళందరికీ సమానమైన ఓటింగ్ నే వస్తుంది. కానీ మనీష్, ఫ్లోరా లకు కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాస్క్ మ్యాన్ హరీష్ గత రెండు రోజులుగా అన్నం తినడం పూర్తిగా మానేసాడు అనే విషయం అందరికీ తెలిసిందే.
కానీ నిన్న తనూజ ఆయన చేత అన్నం తినిపించింది. దీంతో ఆయన నిరాహార దీక్ష వీడినట్టే. ఒకవేళ మొండిగా అలాగే కొనసాగించి ఉండుంటే వీకెండ్ లో నాగార్జున ఇంటికి పంపేసేవాడని విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన టాక్. అంత దూరం తెచ్చుకోక ముందే హరీష్ తెలివిగా తన నిరాహార దీక్ష ని విరమించుకున్నాడు. దీనిని బట్టీ అర్థం అయ్యింది ఏమిటంటే , శనివారం రోజున ఈయన బాగా నెగిటివ్ అయిపోవడంతో, జనాల్లో కాస్త సానుభూతి తెచ్చుకోవడం కోసమే ఈ డ్రామా ఆడినట్టు అనిపిస్తుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో రాబోయే రోజుల్లో ఇతని ప్రవర్తన బట్టీ తెలుస్తుంది.