Nithin And Sharwanand: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న హీరోలందరి మధ్య విపరీతమైన పోటీ ఉంది. ఏ ఒక్క సినిమాతో ప్లాప్ ని మూట గట్టుకున్న కూడా వాళ్ళు పోటీ నుంచి వెనకపడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క హీరో మంచి సినిమాలను ఎంచుకొని భారీ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు మాత్రమే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తుండడం విశేషం… ప్రస్తుతం మన హీరోలందరు వరుస పెట్టి సక్సెస్ లను సాధిస్తున్నారు. అందువల్లే మనకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ క్రియేట్ అయింది…
ఇక స్టార్ హీరోల విషయం పక్కన పెడితే మీడియం రేంజ్ హీరోలు మాత్రం అన్ని డిజాస్టర్ సినిమాలను చేస్తూ మార్కెట్ ను కోల్పోతున్నారు. ముఖ్యంగా నితిన్, శర్వానంద్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. వాళ్ళు ఏ సినిమా చేసిన కూడా అవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడమే కాకుండా భారీ డిజాస్టర్లుగా మిగులుతున్నాయి…
గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది. నిజంగా హీరోలు సైతం మంచి విజయాలను సాధిస్తున్న క్రమంలో వీళ్ళు ఎందుకు వెనుకబడి పోతున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంది… నిజానికి వీళ్ళిద్దరితో ఎలాంటి సినిమాలు చేయాలి ఏ సినిమాలు చేస్తే సక్సెస్ లు సాధించవచ్చు అనేది కూడా ఇప్పుడున్న దర్శకులకు అర్థం కావడం లేదు.
ఎందుకంటే లవ్ స్టోరీలు చేయడానికి వీళ్లకు ఆల్టర్నేట్ గా చాలామంది కొత్త హీరోలు వచ్చారు. ఇక థ్రిల్లర్ సినిమాలు, హార్రర్ సినిమాలను వీళ్ళతో చేయలేము…మాస్ సినిమాలను చేసే కెపాసిటి కూడా వీళ్లకు లేదు. కాబట్టి ఏ జానర్ లో సినిమా చేస్తే ఆడతాయి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక తొందర్లోనే వీళ్ళు కూడా ఒక జానర్ కి ఫిక్స్ అయిపోయి మంచి విజయాన్ని సాధించి అదే జానర్ లో సినిమాలను కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…