https://oktelugu.com/

Sreemukhi: వామ్మో శ్రీముఖి ఆ ఫేమస్ సింగర్ ను లవ్ చేస్తుందా..? ఇన్ని రోజులకు నిజం బయటపెట్టేసిందిగా?

Sreemukhi శ్రీముఖి ఓ వ్యక్తితో ప్రేమలో పడిందట. ఈ వార్త ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ ఇప్పటి వరకు వాటిపై స్పందించలేదు ఈ అమ్మడు. దీంతో అభిమానులు, నెటిజన్లు కూడా శ్రీముఖి ప్రేమిస్తుందని.. ప్రేమ పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 18, 2024 / 02:37 PM IST

    Sreemukhi

    Follow us on

    Sreemukhi: యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లరి, అందం, చురుకుదనం, తెలివితో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో, బుల్లితెరపై ఈ అమ్మడుకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే శ్రీముఖి స్టార్ మాలో సూపర్ సింగర్ అనే ఓ రియాలిటీ షోను షోస్ట్ చేస్తుంది. ఈ షో ప్రతి ఆదివారం, శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అవుతుంటుంది. రీసెంట్ గానే ఈ షోకు సంబంధించిన ఓ ప్రోమోను వదిలారు మేకర్స్. అయితే ఇందులో రెట్రో నేపథ్యంలో పాటలను పాడారు సింగర్స్.

    అయితే ఈ ప్రోమోలో జడ్జ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ శ్రీముఖితో ఓ పాటకు డాన్స్ చేస్తూ ఓ సైగ చేస్తాడు. దీంతో వెంటనే రెస్పాండ్ అయిన రాములమ్మ ఈ తుంటరి అబ్బాయి ఇలా చేస్తాడని అనుకున్నా.. అయితే తనతో ప్రేమలో లేనని.. రాహుల్ సిప్లిగంజ్ ప్రేమలో ఉన్నానని తెలిపింది అమ్మడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది. అయితే మరో వైపు శ్రీముఖి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతుందని, తన త్వరలో పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తోంది. ఈ వేసవిలోనే అమ్మడు పెళ్లి జరగనుందట.

    శ్రీముఖి ఓ వ్యక్తితో ప్రేమలో పడిందట. ఈ వార్త ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ ఇప్పటి వరకు వాటిపై స్పందించలేదు ఈ అమ్మడు. దీంతో అభిమానులు, నెటిజన్లు కూడా శ్రీముఖి ప్రేమిస్తుందని.. ప్రేమ పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు. మరి చూడాలి ఈ వదంతులు నిజం అవుతాయో లేదో.. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫుల్ గా సంపాదించేస్తుంది శ్రీముఖి. ఈ భామ ఒక్క షోకు లక్ష నుంచి యాభై వేల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఇక షోను బట్టి రెమ్యూనరేషన్ కూడా మారుతుందట.

    శ్రీముఖి బుల్లితెరపై అలరిస్తూనే వెండితెరపై తన సత్తా చాటుతుంది. చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన భోళా శంకర్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించింది రాములమ్మ. ఇందులో శ్రీముఖి, కీర్తి సురేష్ ఫ్రెండ్ గా కనిపించింది. ఈ సినిమా పెద్దగా నెటిజన్లను ఆకట్టుకోలేకపోయింది. కానీ శ్రీముఖి పాత్రను ఆదరించారు అభిమానులు. మరి చూడాలి ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలతో అమ్మడు కనిపిస్తుందో..