Pooja Hegde: ముకుంద చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై … ప్రస్తుతం మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారిన బ్యూటీ పూజా హెగ్డే. ముకుంద, ఒక లైలా కోసం చిత్రాలలో హీరోయిన్ గా చేసిన ఆమెకు అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో… పూజ హెగ్డే తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి వెనక్కు తిరిగే చూసే ఛాన్స్ లేకుండా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. అరవింద సమేత, అలా వైకుంఠపురం, తదితర చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా.

కాగా ఈరోజు 31 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్బంగా ప్రభాస్ తో జోడీగా నటిస్తున్న ” రాధే శ్యామ్ ” మూవీ నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో పూజా తెల్లని దుస్తులు ధరించి… చిరునవ్వుతో కనిపిస్తుంది. ఈ పోస్టర్ ను చూసిన వారంతా పూజా ఏంజల్ లా ఉందంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో … యువి క్రియేషన్స్ నిర్మించిన రాధే శ్యామ్ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14, 2022 న విడుదల కానుంది. ఒక మధురమైన ప్రేమ కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించబోతోందని మూవీ యూనిట్ చెబుతున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.