Game Changer Movie : ప్రతీ సినిమాకి ట్రైలర్ లో చూపించిన కొన్ని షాట్స్ ని చూసి మనం చాలా ఊహించుకుంటాము. కచ్చితంగా ఇది ఇంటర్వెల్ బ్యాంగ్, ఇది పరిచయ సన్నివేశం, ఇది క్లైమాక్స్ అని డిసైడ్ అయిపోతూ ఉంటాము. కానీ అలా అన్ని సినిమాలకు మనం అనుకున్నట్టుగా ఉండదు. కొన్ని చిత్రాలు ‘అన్ ప్రెడిక్టబుల్’ గా ఉంటాయి. అలాంటి సినిమాల జాబితాలోకి రేపు విడుదల అవ్వబోతున్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం చేరబోతోంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చివర్లో రామ్ చరణ్ కట్టి పట్టుకొని హెలికాప్టర్ నుండి దూకే షాట్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇది హై వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇది రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ అట. ఇందులో రామ్ చరణ్ ప్రస్తుత కాలం లో IAS ఆఫీసర్ గా కనిపిస్తాడు. అది కూడా మామూలు IAS కాదు, మాస్ IAS ఆఫీసర్.
మంచి గా మాట్లాడితే మంచిగా మాట్లాడుతాడు, అతని దగ్గర తేడా వేషాలు వేస్తే మాత్రం ఎవరైనా గల్లంతు అవ్వాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలో ఆయన కాలేజీ సన్నివేశాల్లో కనిపిస్తాడు. ఈ సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయట. హీరో కి మొదటి నుండి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం రాదు. దాని వల్ల అనేక సమస్యలు రావడం వంటివి గతం లో మనం అనేక సినిమాల్లో చూసాము. కానీ ఒక IAS స్థాయి వ్యక్తికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని సమస్య ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది డైరెక్టర్ శంకర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తీసినట్టు తెలుస్తుంది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు బుల్లెట్ స్పీడ్ తో స్క్రీన్ ప్లే నడిచిపోతుందట. ఆ విధంగా ఈ సినిమాని ఎడిటింగ్ చేసినట్టు డైరెక్టర్ శంకర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ఈ చిత్రం లోని పాటలు వేరే లెవెల్ లో వచ్చినట్టు తెలుస్తుంది. స్క్రీన్ మీద కేవలం పాటలను చూడడం కోసమే ఆడియన్స్ రిపీట్ లో థియేటర్స్ కి వస్తారట. ఆ రేంజ్ లో ఉంటుంది. ఇలాంటి సాంగ్స్ ని మామూలు స్క్రీన్స్ లో చూడడం కంటే ఐమాక్స్, 4DX వంటి స్క్రీన్స్ లో చూస్తే వచ్చే కిక్ వేరు. మీరు ఉంటున్న ప్రాంతాల్లో ఈ స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదలైతే మర్చిపోకుండా చూడండి. ఇలాంటి భారీ హంగులున్న చిత్రాలను అలాంటి స్క్రీన్స్ లోనే చూడాలి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ ఒక ఎత్తు అయితే, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సాంగ్స్ మరో ఎత్తు. ఇవి పూర్తిగా గ్రామీణ నేపథ్యం లో ఉండే సాంగ్స్. ఇప్పటికే ‘కొండా దేవర’, ‘అరుగు మీద’ సాంగ్స్ ని మీరంతా వినే ఉంటారు. పిక్చరైజేషన్ కూడా ఈ సాంగ్స్ వెండితెర మీద అదిరిపోతాయట.