https://oktelugu.com/

Tamannaah : తమన్నాకు కోపం వస్తే అలా చేస్తుందా?

సాధారణంగా ఎవరిపైన అయినా కోపం వస్తే వారి మీద అరుస్తుంటారు. కానీ తమన్నా మాత్రం అలా చేయదట. ఈమెకు కోపం వస్తే తన గదికి వెళ్లి డోర్స్ వేసుకొని ఒంటరిగా కూర్చుంటుందట. ఎవరు ఎంత పిలిచిన పలకదట. తన కోపం చల్లారిన తర్వాత చట్ట నీటితో షవర్ చేసి బయటకు వస్తుందట. ఆ తర్వాత తన సమస్య ఏంటి? తాను ఎందుకు అలా ఉందనే విషయాలను వారితో షేర్ చేసుకుంటుందట.

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2024 / 01:54 PM IST
    Follow us on

    Tamannaah : సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది తమన్నా. ఈమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో ఈమెకు తిరుగులేకుండా పోయింది. అయితే ఈ మధ్య తెలుగులో ఈ అమ్మడు కాస్త సినిమాలు తగ్గించినట్టుగానే కనిపిస్తుంది. అయితే టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తమన్నా తమిళ్, హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్ లతో బిగా అయిపోయింది ఈ అమ్మడు.

    అయితే తమన్నా సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లతో కూడా ఫుల్ బిజీ అయిపోయింది. ఇక మిల్క్ బ్యూటీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని.. వారి ప్రేమ విషయాన్ని బహిరంగంగా తెలియజేస్తూ ఇద్దరు చట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు కూడా. వీరిద్దరు కలిసి బయటకనిపించడంతో వీరి మీద రూమర్స్ ఎక్కువ వచ్చాయి.

    అయితే సినిమా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న తమన్నాకు కోపం కూడా ఎక్కువేనట. కానీ తమన్నాకు కోపం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇక మీడియా మీద, ఇతరుల మీద ఈమె ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఇతరుల మీదకు కోపానికి రాని తమన్నా.. తన దగ్గర ఉన్న వారి మీద కోపం వస్తే మాత్రం కంట్రోల్ చేసుకోదట. ఈమెకు కోపం వచ్చే సందర్బాలు తక్కువే అయినా.. కోపం వస్తే ఆమె చుట్టుపక్కల వారు భయపడుతారట.